ఆదిలాబాద్ ( Adilabad )జిల్లాలో పత్తి విత్తనాల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.ఈ మేరకు సీడ్స్ షాపుల ముందు రైతులు బారులు తీరారు.
ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతన్నలు క్యూలైన్ లో నిలబడి వేచి చూస్తున్నారు.గత పదిహేను రోజులుగా విత్తనాల కోసం దుకాణాల ఎదుట రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
మరోవైపు ఒక్కో రైతుకు రెండు విత్తన ప్యాకెట్లనే ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని ఫెర్టిలైజర్ షాపుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.