వారిని నమ్మి నేను మోసపోయాను..మీరు జాగ్రత్త: జగపతి బాబు

సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు జగపతిబాబు ( Jagapathi Babu ) ఒకరు.ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించార.

 Jagapathi Babu Says He Was Cheated In Real Estate, Jagapathi Babu, Real Estate ,-TeluguStop.com

  అయితే ప్రస్తుతం జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోగా కాకుండా విలన్ పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను మోసపోయాను మీరు జాగ్రత్త అంటూ జగపతిబాబు చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.తాను ఎవరి చేతిలో మోసపోయాను ఏంటి అనే విషయాలు తర్వాత చెబుతానని కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈయన తెలిపారు.ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే జగపతిబాబు కూడా ఇలాంటి మోసానికి గురి అయ్యారని తెలుస్తోంది.

ఇటీవలే ఒక రియల్ ఎస్టేట్ యాడ్( Real estate ) లో నేను నటించాను.అయితే వారు నన్ను మోసం చేసారు.వాళ్ళు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా.భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి అని జగపతి బాబు పేర్కొన్నారు.

అయితే ఈయనని మోసం చేసింది ఎవరు ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.జగపతిబాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించడమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube