మే 30వ తేదీ గంగ దసరా పండుగ.. ఆరోజు తప్పకుండా ఇలా చేయాలి..!

గంగా దసరా పండుగకు హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లాపక్షం పదో రోజున జరుపుకుంటారు.

 May 30th Ganga Dussehra Festival.. Must Do This On That Day..! Ganga, Dussehra F-TeluguStop.com

అంటే ఈ సంవత్సరం మే 30వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.ఉత్తరాదినా గంగా దసరా పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ఈ రోజు గంగా మాత( Ganga ) స్వర్గం నుంచి భూలోకానికి దిగివస్తుందని ప్రజలు నమ్ముతారు.

భగీరథుడు రెండవసారి కఠోర తపస్సు చేసి, మా పితృ దేవతలను ఉద్దరించేందుకు గంగాను విడిచి పెట్టాలని శివుని ( lord shiva )ప్రార్థిస్తాడు.ఇక శివుడు మార్గం విడుస్తూ బిందు సరోవరంలో పడేలా చేస్తాడు.అందులో మొసళ్లు, ఎండ్రికాయలు, పాములు, చేపలు, సుడులు ఇలా గంగ బిందు సరోవరంలో పడుతుంది.

ఇలా గంగావతరణం జరుగుతుంది.అప్పుడు అందరూ పాప విముక్తులు అవుతారు.

అందువలన గంగా దసరా రోజున గంగామాతను పూజించాలి.గంగా దసరా ( Ganga Dussehra )పండుగ రోజున గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా సకల పాపాలు దూరమైతాయని, మరణం తర్వాత మోక్షం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.

గంగా దసరా పూజా విధానం,శుభ ముహూర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దశమి తిధి మే 29 2023 ఉదయం 11 గంటల 49 నిమిషములకు మొదలై మే 30 2023 మధ్యాహ్నం 1.07 నిమిషములకు ముగుస్తుంది.అలాగే గంగా దసరా రోజున ఉదయాన్నే నిద్ర లేచి గంగా స్నానం చేయాలి.

లేదా సమీపంలోని నదికి వెళ్లి స్నానం చేయాలి.ఇంకా చెప్పాలంటే గంగా మాతకు హారతి ఇవ్వాలి.

గంగా స్నాననికి వెళ్లలేని వారు ఇంట్లో ఉండే స్నానపు నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయడం కూడా ఎంతో మంచిది.ఈ రోజున ఇంట్లోని పూజ మందిరంలో దీపం వెలిగించాలి.

గంగామాత( Gangamata )ను ధ్యానం చేయాలి.గంగా దసరా రోజున దానం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube