వివాహితపై ప్రేమెన్మాది యాసిడ్ తో దాడి..భర్త, పిల్లలను వదిలి తనతో రావాలంటూ..!

ప్రేమెన్మాది పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితపై మనసు పడి, భర్త పిల్లలను వదిలి తనతో జీవితం పంచుకోవాలని వేధించడం ప్రారంభించాడు.అందుకు ఆ వివాహిత అంగీకరించలేదు.

 Man Attacks Woman Her Husband And 2 Kids With Acid In Bihar Details, Man , Marri-TeluguStop.com

దీంతో ఆమెపై పగ పెంచుకొని మహిళతో సహా ఆమె కుటుంబ సభ్యులపై ఆదివారం తెల్లవారుజామున యాసిడ్ తో దాడి( Acid Attack ) చేశాడు.ప్రస్తుతం బాధితులు అంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలు ఏం జరిగిందో చూద్దాం.

వివరాల్లోకెళితే.

బీహార్ లోని( Bihar ) ముజఫర్ పూర్ జిల్లా తూర్పు చంపారన్ ప్రాంతంలో ఉండే పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.బాధిత మహిళ తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి మోతీహరి ప్రాంతంలో నివాసం ఉంటుంది.

నిందితుడు మహేష్ భగత్( Mahesh Bhagat ) రాష్ట్ర వాటర్ బోర్డ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే బాధిత మహిళ భర్త అదే సంస్థలో రోజువారి కూలీగా పనులకు వెళ్లేవాడు.

Telugu Mahesh Bhagat, Acid, Acid Attack, Bihar, Married, Muzaffarpur, Board-Late

ఈ క్రమంలో బాధిత మహిళకు, మహేష్ కు మధ్య పరిచయం ఏర్పడింది.అప్పటినుంచి మహేష్ పరిచయాన్ని చనువుగా తీసుకొని ఆ వివాహితను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు.భర్త, ఇద్దరు పిల్లలను వదిలి తనతో పెళ్లి చేసుకుని తనతో జీవించాలని పలుమార్లు ఆ వివాహితను వేధించాడు.ఆ వివాహిత ససేమీరా అనడంతో ఆ వివాహికతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు.

Telugu Mahesh Bhagat, Acid, Acid Attack, Bihar, Married, Muzaffarpur, Board-Late

నిందితుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన వివాహిత లొంగక పోవడంతో ఆమెపై పగ పెంచుకొని ఆదివారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ మహిళా కుటుంబ సభ్యులపై యాసిడ్ తో దాడి చేశాడు.అనంతరం ఆ కుటుంబ సభ్యులకు పైకి వ్యక్తులు సహాయం చేయకుండా తలుపులకు తాళం వేసి పరారయ్యాడు.ఈ యాసిడ్ దాడిలో మహిళతో పాటు భర్త, కుమారుడు, కుమార్తె కు తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా విచారణలో నిందితుడు మహేష్ తనకు ఆ బాధిత మహిళకు ఇదివరకే వివాహం అయినట్లు నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్లు సృష్టించి, ఆ మహిళను వేదించసాగాడు.

ఆ వివాహిత అంగీకరించకపోవడంతో కుటుంబ సభ్యులపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube