వివాహితపై ప్రేమెన్మాది యాసిడ్ తో దాడి..భర్త, పిల్లలను వదిలి తనతో రావాలంటూ..!
TeluguStop.com
ఓ ప్రేమెన్మాది పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితపై మనసు పడి, భర్త పిల్లలను వదిలి తనతో జీవితం పంచుకోవాలని వేధించడం ప్రారంభించాడు.
అందుకు ఆ వివాహిత అంగీకరించలేదు.దీంతో ఆమెపై పగ పెంచుకొని మహిళతో సహా ఆమె కుటుంబ సభ్యులపై ఆదివారం తెల్లవారుజామున యాసిడ్ తో దాడి( Acid Attack ) చేశాడు.
ప్రస్తుతం బాధితులు అంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అసలు ఏం జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.బీహార్ లోని( Bihar ) ముజఫర్ పూర్ జిల్లా తూర్పు చంపారన్ ప్రాంతంలో ఉండే పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధిత మహిళ తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి మోతీహరి ప్రాంతంలో నివాసం ఉంటుంది.
నిందితుడు మహేష్ భగత్( Mahesh Bhagat ) రాష్ట్ర వాటర్ బోర్డ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే బాధిత మహిళ భర్త అదే సంస్థలో రోజువారి కూలీగా పనులకు వెళ్లేవాడు.
"""/" /
ఈ క్రమంలో బాధిత మహిళకు, మహేష్ కు మధ్య పరిచయం ఏర్పడింది.
అప్పటినుంచి మహేష్ పరిచయాన్ని చనువుగా తీసుకొని ఆ వివాహితను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు.
భర్త, ఇద్దరు పిల్లలను వదిలి తనతో పెళ్లి చేసుకుని తనతో జీవించాలని పలుమార్లు ఆ వివాహితను వేధించాడు.
ఆ వివాహిత ససేమీరా అనడంతో ఆ వివాహికతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు.
"""/" /
నిందితుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన వివాహిత లొంగక పోవడంతో ఆమెపై పగ పెంచుకొని ఆదివారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ మహిళా కుటుంబ సభ్యులపై యాసిడ్ తో దాడి చేశాడు.
అనంతరం ఆ కుటుంబ సభ్యులకు పైకి వ్యక్తులు సహాయం చేయకుండా తలుపులకు తాళం వేసి పరారయ్యాడు.
ఈ యాసిడ్ దాడిలో మహిళతో పాటు భర్త, కుమారుడు, కుమార్తె కు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా విచారణలో నిందితుడు మహేష్ తనకు ఆ బాధిత మహిళకు ఇదివరకే వివాహం అయినట్లు నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్లు సృష్టించి, ఆ మహిళను వేదించసాగాడు.
ఆ వివాహిత అంగీకరించకపోవడంతో కుటుంబ సభ్యులపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
అబ్బో, ఎంత మర్యాదో: జంటకు ఇబ్బంది కలగకూడదని వేచి ఉన్న పెంగ్విన్.. వీడియో వైరల్!