మన భారత దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందూ దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి.కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎంతో ప్రాచుర్యంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి.కానీ మన హిందూ దేవాలయాలు భారతదేశంలో ఉండడం సర్వసాధారణమే, కానీ మన హిందూ దేవాలయాలు ఒక భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఇతర దేశాలలో ఉన్న భారతీయ దేవాలయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
1)అంగొర్క్ వాట్:
ఈ దేవాలయం కంబోడియాలో ఉంది.ప్రపంచంలో కల్లా అతి పెద్ద దేవాలయాలలో ఇది ఒకటని చెప్పవచ్చు.ఈ దేవాలయంలో 12 వ శతాబ్దం వరకు విష్ణువుని పూజించేవారు తరువాత బుద్ధుని పూజిస్తున్నారు.
2) నారాయణన్ అక్షరథం:న్యూ జెర్సీ లో ఉన్న ఈ దేవాలయం163 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.ఈ దేవాలయంలో రాధాకృష్ణులు, సీతారాములను, శివపార్వతులను పూజిస్తారు.
3) బెసాహిక్ ఆలయం:ఇండోనేషియాలో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ దేశంలో 50 ఎకరాలలో ఈ దేవాలయం విస్తరించి ఉంది.ఇక్కడ విష్ణువు, శివుని పూజిస్తారు.
4)ప్రంబనన్
ఇండోనేషియాలో హిందువులు తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి వారి2000 కరెన్సీపై వినాయకుడి ఫోటో ఉంటుంది.దాదాపు 37 ఎకరాలలో త్రిమూర్తుల దేవాలయాలను నిర్మించి ఉన్నారు.
5)BAPS శ్రీ స్వామి నారాయణ మందిరం:
ఇక్కడ 18 ఎకరాల లో నారాయణ స్వామి దేవాలయం నిర్మించి ఉన్నారు.
6) బటు గుహలు:
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మలేషియాలో ఎంతో ప్రసిద్ధి చెందినది.ఇక్కడ అత్యంత ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహంతో పాటు 50 అడుగుల ఎత్తులో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నాయి.
7) శ్రీ శివ విష్ణు ఆలయం:
ఆస్ట్రేలియాలో ఉండే అతి పెద్ద హిందూ దేవాలయాలు శివుడు, విష్ణు దేవాలయాలు ప్రసిద్ధిచెందినవి.హోలీ మరియు దీపావళి పండుగలను ఈ దేవాలయాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
8) మహేశ్వర నాథ్ ఆలయం:
మారిషస్ ధీవుల్లో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో శివుని పూజిస్తారు.ఇక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండటం వల్ల1888 లో కలకత్తా నుంచి వెళ్లిన అల్లా కన్నూయ పాండిట్ ఆలయాన్ని నిర్మించారు.
9) స్వామినారాయణ్ ఆలయం:
పాకిస్తాన్ లో ఉన్న హిందూ దేవాలయం నారాయణ స్వామి దేవాలయం.ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముస్లింలు సైతం ఈ దేవాలయానికి వెళ్తుంటారు.
హిందూ సంప్రదాయాలను గౌరవించే దేవాలయాలు కేవలం భారతదేశంలోనే కాకుండా దేశవిదేశాలలో ఉండటంతో మన దేశ సంస్కృతిని ఇతర దేశాలలో కూడా చాటి చెబుతోందని చెప్పవచ్చు.