ఈ నెల 29వ తేదీన తొలి ఏకాదశి( tholi Ekadashi ) జరగబోతుంది.ఆ రోజు శ్రీ మహా విష్ణువుకు( Sri Maha Vishnu ) ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.
చాలా మంది ప్రజలు ఎంతో విశిష్టత కలిగి ఉన్న తొలి ఏకాదశి రోజు స్వామికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది భక్తులకు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలనే సందేహాలు వస్తూ ఉంటాయి.
కేవలం అన్నంతోనే 92 రకాల ప్రసాదాలు చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.ముఖ్యంగా చెప్పాలంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పులుపు, కొబ్బరి, నువ్వులు ఇలా పదార్థాలు వేరువేరుగా కలిపి ప్రసాదాలు తయారు చేయవచ్చు.

మీరు చేయగలిగితే 92 రకాల ప్రసాదాలు తయారు చేసి పెట్టవచ్చు.మీ ఓపికను బట్టి, అలాగే స్తోమతను బట్టి స్వామికి ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు.కానీ స్వామిని ఆరాధించే పూజలో త్వ గుణాలు కలిగించే ప్రసాదాలను మాత్రమే చేయమని శాస్త్రం చెబుతోంది.ఇంకా చెప్పాలంటే కారాలు, మిరియాలు, ఆవాలు, మిరపకాయలు ఇలాంటి వాటిని తక్కువగా ఉపయోగించి వంట చేయాలి.
పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, తేనె( Milk, curd, ghee, jaggery, honey ) లాంటి వాటిని ఎక్కువ ఉపయోగించి ప్రసాదాలు చేయడం మంచిది.

ఈ రోజుల్లో నెయ్యి వాడితే లావు అయిపోతామని, కొలెస్ట్రాల్( Cholesterol ) పెరుగుతాయని పెరుగుతుందని నెయ్యిని దూరంగా పెడుతున్నారు.వాస్తవానికి నెయ్యి వాడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.అలాగే నెయ్యి వాడితే ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రంలో స్పష్టంగా ఉంది.
అప్పట్లో నెయ్యి క్వాలిటీ గా ఉండేది.ఇప్పుడు నెయ్యి నీ కల్తీ చేస్తున్నారు.
స్వచ్ఛమైన నెయ్యి అన్ని సద్గుణాలు కలిగి ఉంటుంది.పాత రోజుల్లో అన్ని నేతి వంటకాలు చేసేవారు.
నూనె వాడేవారు కాదు.ఇప్పుడు ఎక్కువ శాతం వంటకాలు నూనెతో మాత్రమే చేస్తున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే దేవుడికి చేసే పదార్థాలు నెయ్యితోనే చేయాలి.వాటినే భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టాలి.