ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మీ (Rashmi)ఒకరు.బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కూడా నటించారు.అయితే ఇండస్ట్రీలో పెద్దగా రష్మీ సక్సెస్ కాలేకపోయారు.ఇలా ఇండస్ట్రీలో రష్మీ సక్సెస్ కాకపోవడంతో ఈమె బుల్లితెరపై స్థిరపడ్డారు.ఇలా బుల్లితెర పై ఎంతో మంచి సక్సెస్ సాధించారు.అయితే బుల్లితెర కార్యక్రమాలలో సుధీర్(Sudheer) ఉన్నప్పుడు రష్మీ క్రేజ్ భారీగా ఉందని చెప్పాలి.
ఎప్పుడైతే సుధీర్ బుల్లితెరకు దూరమయ్యారో ఆ క్షణం నుంచి రష్మికి కూడా కాస్త క్రేజ్ తగ్గింది.

అయితే రష్మీ ఒకానొక సమయంలో హీరోయిన్ గా వెండి తెరపై నటించారు.అయితే ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ఈ విధంగా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి రష్మీ వెండితెరపై ఎందుకు సక్సెస్ సాధించలేకపోయారన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.
అంతేకాకుండా హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని కత్తిలాంటి ఫిజిక్ ఉన్నటువంటి రష్మీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి కారణాలు గురించి ఆరా తీస్తున్నారు.

ఇలా ఎంతో అందం అభినయం సొంతం చేసుకున్నటువంటి రష్మీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి మరే కారణం లేదు.కెరీర్ మొదట్లో సినిమా అవకాశాలను అందుకున్నటువంటి రష్మీ ఎక్కువగా బోల్డ్ సన్నివేశాలలో (Bold scenes) నటించారు.ఇలా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమెను అభిమానులు హీరోయిన్గా చూడటం లేదు అందుకే తనకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదని తెలుస్తోంది.
ఇక ఈమెకు సినిమా అవకాశాలు వచ్చిన ఇలాంటి బోల్డ్ పాత్రలలో నటించే అవకాశాలు రావడంతోనే రష్మీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.








