మాయమాటలతో జనానికి కుచ్చుటోపీ.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు

వివిధ స్కామ్‌లలో 12 మందిని దాదాపు 1,06,000 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు( Singapore Court ) బుధవారం మూడేళ్ల జైలు శిక్షతో పాటు 2000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.

నిందితురాలిని ప్రిస్కిల్లా షమణి మనోహరన్‌గా( Priscilla Shamani Manoharan ) గుర్తించారు.2022 నుంచి ఆమె ఈ నేరాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

హౌసింగ్ బోర్డ్ పబ్లిక్ స్కీమ్( Housing Board Public Scheme ) కింద అపార్ట్‌మెంట్‌కు చెందిన లావాదేవీకి డబ్బు చెల్లించాల్సి ఉందని అయితే తన కొడుకు, కుమార్తె చనిపోయినట్లుగా చెబుతూ మనోహరన్ ఒక వ్యక్తిని 57,250 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసింది.

అంతేకాదు.తానే చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి, లాయర్‌గా నటిస్తూ లీగల్ ఫీజుల కోసం ఆ వ్యక్తికి బూటకపు ఇన్‌వాయిస్‌లను( Fake Invoices ) పంపినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

ఇతర కేసులతో పాటు మెడికల్ ఫీజు కోసం అత్యవసరంగా డబ్బు చెల్లించాల్సి ఉందంటూ ఆసుపత్రికి , తనకు మధ్య జరిగినట్లుగా నకిలీ వాట్సాప్ రికార్డులను సృష్టించింది.

"""/" / అలా ప్రజలను మోసం చేయడమే ప్రవృత్తిగా సాగించింది మనోహరన్.ఈ ఏడాది ప్రారంభంలోనూ ఇద్దరు వ్యక్తులను 11,800 డాలర్ల మేర ఆమె మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

జూన్ 20వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా తన అపార్ట్‌మెంట్‌లోని గదులను అద్దెకు ఇవ్వడం సహా పలు మోసాలకు సంబంధించి ఆరు ఆరోపణలను అంగీకరించింది.

అలాగే శిక్ష విధించే సమయంలో మరో 14 ఇతర అభియోగాలను పరిగణనలోనికి తీసుకుంది న్యాయస్థానం.

"""/" / కాగా.ఈ ఏడాది ప్రారంభంలో చట్టవిరుద్ధంగా రోగులకు మత్తుమందులను సూచిస్తున్నాడన్న అభియోగాలపై సింగపూర్‌కు చెందిన డిసిప్లినరీ ట్రిబ్యునల్ భారత సంతతికి చెందిన డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

నిందితుడిని డాక్టర్ మణీందర్ సింగ్ షాహిగా( Dr Maninder Singh Shahi ) గుర్తించారు.

అతనికి 35 సంవత్సరాలకు పైగా అనుభవంతో పాటు దశాబ్ధానికి పైగా క్లినిక్ నడుపుతున్నట్లు ఛానెల్ న్యూస్ ఏషియా తెలిపింది.

షాహి.తన రోగులలో ఏడుగురికి మత్తుమందులను సిఫారసు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ నేరానికి గాను మణీందర్ షాహిని మూడేళ్ల పాటు మెడికల్ ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేసింది ట్రిబ్యునల్.

రామ్ చరణ్ దగ్గర అలాంటి పవర్ ఉంది.. శంకర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!