కోడి గుడ్డును మంచి పౌష్టిక ఆహారం కోసం వైద్యులు కచ్చితంగా డైట్ లో చేర్చుకోమని సలహా చెబుతూ ఉంటారు.అయితే కోడి గుడ్డు పై రకరకాల థియరీలు వచ్చాయి.
కొందరు కోడిగుడ్డు ఆరోగ్యానికి హాని చేస్తుందని చెబుతున్నారు.చాలామంది వారంలో కనీసం మూడుసార్లు అయినా కోడిగుడ్డును తినాలని కూడా చెబుతున్నారు.
కోడిగుడ్డు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది, ఏ రకంగా కీడు చేస్తుంది, గుండె పని తీరు మెరుగుపరచడంలో కోడిగుడ్డు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడి గుడ్డు పై ఈ మధ్య వైద్య పరిశోధకులతో ఒక అధ్యాయం జరిగింది.
కోడిగుడ్డు తీసుకోవడం వల్ల గుండె పనితీరు చాలా మెరుగుపడుతుందని పరిశోధనలు తెలుసుకున్నారు.అయితే వారంలో ఒకటి నుంచి మూడు గుడ్లు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయని ఒక అధ్యాయంలో తెలిసింది.
వారానికి నాలుగు నుంచి ఏడు గుడ్లు తినే 75% మందిలో ఉన్న గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే మారుతున్న కాలం, జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకటి నుంచి మూడు గుడ్లు తినేవారు ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.గుడ్డు తీసుకోవడం ద్వారా గుండె పనితీరు బాగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.గుడ్డుకు గుండెకు ఉన్న సంబంధం పై చాలా అధ్యయనాలు చేశారు.
అయితే ఈ అధ్యయనాలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

దీని వల్ల ఆరోగ్యకరమైన గుండెకు గుడ్డు మంచిదా చెడ్డదా అనే చర్చ మొదలైంది.ఆరోగ్యకరమైన వ్యక్తి గుడ్డును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గుండె పనితీరు పై పెద్దగా ప్రభావం చూపదని తెలిసింది.అయితే గుడ్డును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాబట్టి ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవడమే మంచిది.