నేను యువకుడిని కాదు.. కానీ నిజాలే మాట్లాడా : ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో వైఫల్యంపై బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల( US presidential election ) సందర్భంగా డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump )ల మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ వాడివేడిగా జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ చర్చా కార్యక్రమంలో బైడెన్‌పై ట్రంప్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించారు.

 Us President Joe Biden Attempts To Dispel Worry About His Debate Performace In N-TeluguStop.com

దీంతో బైడెన్ అధ్యక్ష రేసులోంచి తప్పుకోవాలని ప్రత్యర్ధులు సహా సొంత పార్టీ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు.ఇంటా బయటా విమర్శలు వస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు బైడెన్‌కు అండగా నిలిచారు.

భార్య జిల్, కుమారుడు హంటర్, మనుమలు సహా పలువురు బంధుమిత్రులు ప్రత్యేకంగా సమావేశమై అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవద్దని ఆయనకు సూచించారు.

Telugu Donald Trump, Jill Biden, Joe Biden, Michael Tyler, Carolina, Presidentia

ఈ నేపథ్యంలో జో బైడెన్ ( Joe Biden )ఓ కొత్త వీడియో విడుదల చేశారు.తాను యువకుడిని కాదని, వృద్ధాప్యం వల్ల వచ్చిన ఇబ్బందులని అధ్యక్షుడు అంగీకరించారు.కానీ వాస్తవాలు మాట్లాడటం ఒకటే తనకు తెలుసునని.

ట్రంప్ అలా చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు.నార్త్ కరోలినాలో ర్యాలీ అనంతరం బైడెన్ ఈ వీడియో విడుదల చేశారు.

ట్రంప్‌తో చర్చలో పాల్గొన్నప్పటి కంటే ఆయన మరింత శక్తివంతంగా కనిపించారని.డిబేట్ జరుగుతున్నప్పుడు బైడెన్ తడబడ్డారని, స్తంభించిపోయారని, తప్పుగా మాట్లాడారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ట్రంప్ గొప్ప ఆర్ధిక వ్యవస్ధను నిర్మించానని , కోవిడ్ మహమ్మారి గురించి, జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన తిరుగుబాటుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పారని బైడెన్ దుయ్యబట్టారు.

Telugu Donald Trump, Jill Biden, Joe Biden, Michael Tyler, Carolina, Presidentia

ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో జరిగిన డ్యామేజీని కవర్ చేసేందుకు బైడెన్ కుటుంబ సభ్యులు, డెమొక్రాటిక్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగా ఈ వీకెండ్‌లో బైడెన్ మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా 1500కు పైగా కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు మద్ధతును కూడగట్టాలని భావిస్తున్నారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.

అమెరికన్లు పోరాటం నుంచి వెనక్కి తగ్గని అధ్యక్షుడికి అర్హులని, అది జో బైడెన్ అని బైడెన్ – హారిస్ 2024 కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్( Michael Tyler ) ఒక ప్రకటనలో తెలిపారు.ట్రంప్ అబద్ధాలకోరు, మోసగాడుని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ప్రకటన నేపథ్యంలో తాను అధ్యక్ష బరిలోంచి తప్పుకోవడం లేదనే సంకేతాలను బైడెన్ ఇచ్చినట్లయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube