ఇండస్ట్రీ ఏదైనా సరే హీరోలకు అభిమానులు చూపించే ప్రేమకు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిందే.అభిమానులు తమకు ఇష్టమైన హీరోలకు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి సాహసానికైనా వెనకాడరు.
అంతేకాకుండా.వారి అభిమానాన్ని చూపించుకునేందుకు టాటూలు లేదా వారి వెహికల్స్ పై హీరోలకు ప్రత్యేకమైన స్టిక్కర్లుగా వేయించుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.
అయితే ఇటీవల రేణుక స్వామి హత్య కేసు( Renuka Swamy Murder Case )లో కన్నడ స్టార్ హీరో దర్శన్( Darshan ) జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా( Social media ) ద్వారా బయటికి రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.వెంటనే దర్శన్ శిక్షించాలని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటే.మరికొందరు అతని అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ.
, వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఆయనకు మద్దతుగా కొంత మంది అభిమానులు టాటూలు, స్టిక్కర్లు వేయించుకుంటున్నారు.
ఇక జైల్లో దర్శన్ కి ఖైదీ నెం: 6106 కేటాయించారు.ఇప్పుడు ఈ ఖైదీ నెం: 6106 సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇది వరకు కూడా ఇద్దరు ముగ్గురు కన్నడ నిర్మాతలు కూడా ఇదే టైటిల్ రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయట.కానీ ప్రస్తుతం అది కేసు కోర్టులో ఉన్న కారణంగా ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసుకోలేమని తెలిపారు.
ఇది ఇలా ఉండగా.మరోవైపు దర్శన్ అభిమానులు మాత్రం ఖైదీ నెం: 6106 నెంబర్ ను తమ ఒంటిమీద టాటూ( Tattoo ) లాగా వేయించుకోవడం, అలాగే వారి కార్లు ,బైకులపై కూడా వేయించుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఇవి చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం మీ అభిమానం తగలెయ్య అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే.
మరికొందరైతే మీ ఐడియా సూపర్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.