ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి( Astrologer Venu Swamy ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సమంత, నాగచైతన్యలు అన్యోన్యంగా ఉన్నప్పుడే వారు డివోర్స్ తీసుకోబోతున్నారు అని బోల్డ్ గా జోష్యం చెప్పారు.
అది నిజం కావడంతో ఆయన పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.ఇదొక్కటే కాదు ఇంకా చాలానే జాతకాలు చెప్పగా వాటిలో 95% నిజమయ్యాయి.
దీన్నిబట్టి ఇతనికి జ్యోతిష్య శాస్త్రం పై ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఆస్ట్రాలజర్ ప్రముఖుల జాతకాలు సోషల్ మీడియా(Social media )లో చెప్పడం మానేశారు.అయినా ఆయన పేరు బాగా వినిపిస్తోంది.ఇప్పటికీ వేణుస్వామి గురించి ఏదైనా వీడియో చేస్తే ఫుల్ వ్యూస్ వస్తున్నాయి.
ప్రముఖ న్యూస్ ఛానెళ్లు కూడా ఆయనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఆయన పై వీడియోలు చేస్తున్నాయి.తద్వారా వ్యూస్ పెంచుకుంటున్నాయి.మొత్తం మీద ఈ జ్యోతిష్కుడి కారణంగా చాలామందికి లాభం చేకూరుతోంది.అయితే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆయన ద్వారా బాగా లాభపడాలని చూస్తున్నారు.
అందుకే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఒక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.దానిని వేణు స్వామి స్వీకరించారని కానీ కొద్దిగా ఎక్కువ డబ్బులు అడిగారని సమాచారం.
అందుకు బిగ్ బాస్ టీం కూడా ఒప్పుకుందట.వేణు స్వామి ఈసారి సీజన్లో కనిపించడం ఖాయమని బలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీంతో సోషల్ మీడియా యూజర్లు ఎగ్జైట్ అవుతున్నారు.వేణుస్వామి హౌస్ లోకి ఎంటర్ అయితే చాలామంది జాతకాలు చెప్పించుకోవచ్చు.
సాధారణంగా మనుషులకు జాతకాలు చెప్పించుకోవడం అంటే చాలా ఇష్టం భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని కుతూహల ఉంటుంది.అందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద హాయింపు ఏమీ కాకపోవచ్చు./br>
జాతకాలు చెప్పించుకున్నాక హౌస్ లోని మెంబర్స్ అందరి గురించి వేణు స్వామికి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తద్వారా ఎవరు, ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు అనేది ఆయన అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆడవచ్చు.అంతేకాదు మనుషులను రీడ్ చేయడంలో కూడా వేణు స్వామి నేర్పరి అని కొంతమంది అంటున్నారు.ఆ నైపుణ్యం కూడా ఉంటే ఒక్కొక్కరిని ఆటాడుకుంటూ వేణు స్వామి నెక్స్ట్ సీజన్ టైటిల్ గెలుచుకోవచ్చు.
కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) కు టైటిల్ గెలుచుకోవడం సాధ్యమైనప్పుడు వేణు స్వామికి ఎందుకు సాధ్యం కాదు అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.ఒకవేళ వేణుస్వామి బిగ్ బాస్ విన్ అయితే అతడి పాపులారిటీ మరింత పెరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు.
అంతేకాదు చాలా డబ్బు కూడా లభిస్తుంది.