రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలోని నారాయణపూర్ ప్రాథమిక పాఠశాలలో 40 సంవత్సరాలు స్వీపర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన దరిపెల్లి దేవయ్య( Daripelli Devayya ) ను మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ దేవయ్య సేవలు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిటిఎస్ అయినప్పటికీ ఒక ఉపాధ్యాయునిగా పూర్వ విద్యార్థులు గుర్తించడం జరిగిందన్నారు.
పదవీ విరమణ సమయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి బెనిఫిట్ లేకపోవడం బాధాకరమన్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొస్తామన్నారు.
వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందేటట్టు చూస్తానని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఉపాధ్యాయులు దేవయ్య చేసిన సేవలను కొనియాడారు.
పూర్వ విద్యార్థులు సుమారు 50 వేల రూపాయల వరకు నగదును సమకూర్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అపేరా సుల్తానా,మాజీ సర్పంచ్ నిమ్మ లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ శ్రీనివాస్, నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ బాల నర్సయ్య,మేతె దేవి రెడ్డి, సిరిపురం మహేందర్, మంతురి శ్రీనివాస్ పూర్వ విద్యార్థులు కొండేటి దేవేందర్, ఎండి మాజిద్,యాదగిరి, రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు
.