టీమిండియా 2024 టీ20 వరల్డ్ కప్( Team India 2024 T20 World Cup )ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో భారతీయులందరూ విన్నింగ్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.జైషా రూ.125 కోట్ల నజరానా సైతం ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.రోహిత్, కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్, పాండ్యా, అక్సర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి వారికి విశేషంగా ప్రశంసలు అందుతున్నాయి.నిజానికి ఈ చారిత్రాత్మక విజయం వెనుక వీళ్లే కాదు ఇంకా చాలామందే ఉన్నారు.
వీరు మైదానంలోకి దిగి యుద్ధం చేయరు కానీ తెర వెనుక దాదాపు క్రికెటర్లతో సమానంగా కష్టపడతారు.అలాంటి వ్యక్తులలో ప్రధానంగా చెప్పుకోవాల్సి ఒకరు ఉన్నారు.అతడే రాఘవేంద్ర ద్వివేది( Raghavendra Dwivedi )ప్రస్తుతం ఈ వ్యక్తి పేరు భారత దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.క్రికెట్ కోసం ఇతడు తన జీవితాన్ని అంకితం చేశాడు.
స్మశానంలో పడుకున్నాడు.రోజులూ, వారాలూ అనే లెక్కే లేకుండా ఉపవాసాలు ఉన్నాడు.
కడుపు నిండినా, నిండకున్నా టీమిండియా జట్టుకు అద్భుతమైన సేవలు చేశాడు.టీమ్ ఇండియా క్రికెటర్లకు అతడి కృషి గురించి తెలుసు.
అందుకే వరల్డ్ కప్‌ని అతని దగ్గరికి తీసుకొచ్చి మరీ సెల్ఫీలు దిగారు.ఈ సెల్ఫీలలో నుదుటన బొట్టు పెట్టుకుని చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్న వ్యక్తిని మీరు చూడవచ్చు.
రాఘవేంద్ర ద్వివేది( Raghavendra Dwivedi ) స్వస్థలం కర్నాటకలోని కుంట.క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం.ఇంట్లో తల్లిదండ్రులకి మాత్రం అతడు క్రికెట్ ఆడటం ఇష్టం ఉండేది కాదు.దాంతో 24 ఏళ్ల క్రితం జస్ట్ 21 రూపాయలు చేత పట్టుకొని బయటికి వచ్చేసాడు.
హుబ్లీకి చేరుకొని వారం రోజులు బస్టాండులో తల దాచుకున్నాడు కానీ పోలీసులు అతన్ని అక్కడ ఉండనివ్వలేదు.దాంతో సమీపంలోని గుళ్లో కొద్ది రోజులు నివసించాడు.ప్రసాదం తింటూ ఆకలి తీర్చుకున్నాడు.అక్కడా ఎన్నో రోజులు ఉండనివ్వలేదు.
అయినా ఇంటికి వెళ్లలేదు.పెద్ద క్రికెటర్ అవ్వాలనే ఆశయంతో తిరుగుతూ చివరికి స్మశానవాటికకు వెళ్లిపోయాడు.
అక్కడే ఓ పాడుబడిన ఇంట్లో ఆశ్రయం పొందాడు.నాలుగున్నరేళ్లు ఆ భవనంలోనే ఉన్నాడు.
దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో కుడి చేయి విరిగింది.దాంతో అతడి క్రికెట్ కలలు చెదిరిపోయాయి.
అయినా క్రికెట్ మీద ఆశ చంపుకోలేదు.హుబ్లీలోని ఓ స్టేడియంకు వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేసే క్రికెటర్లకు బంతులు విసరడం మొదలుపెట్టాడు.
వారి ప్రాక్టీసుకు హెల్ప్ చేస్తూ వచ్చాడు.అక్కడే ఒకరు స్నేహితుడయ్యారు.
అతనితో కలిసి బెంగుళూరు వెళ్లగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ అతన్ని ట్రైనింగ్ హెల్పర్‌గా చేర్చుకుంది.కర్నాటక క్రికెటర్ల ప్రాక్టీసు సెషన్లో ఇతడు హెల్ప్ చేశాడు.
అలా పని చేస్తున్న క్రమంలో కర్ణాటక మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత అండర్-19 సెలక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు రాఘవేంద్ర బాగా పనిచేస్తున్నట్లు గుర్తించాడు.కర్ణాటక మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్‌కి ఇంట్రడ్యూస్ చేశాడు.శ్రీనాథ్ రాఘవేంద్రకు కర్ణాటక రంజీ జట్టులోకి ఇన్వైట్ చేశాడు.ఆ జట్టులో పనిచేస్తూనే.ఖాళీ దొరికినప్పుడల్లా చిన్నస్వామి స్టేడియం సమీపంలోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫ్రీగా పని చేశాడు.అక్కడే BCCI లెవల్-1 కోచింగ్ కోర్సు కంప్లీట్ చేసి టీమిండియా క్రికెటర్లకు కూడా బంతులు విసరడం, బౌలింగ్ మెషిన్లో సహాయం చేయడం లాంటివి చేశాడు.
ప్రాక్టీస్‌కు వచ్చిన టీమిండియా క్రికెటర్లకు బాగా నచ్చేసాడు.సచిన్ టెండూల్కర్ కూడా రాఘవేంద్ర ప్రతిభకు అబ్బుర పడ్డాడు.
సచిన్ రికమండేషన్‌తో 2011లో టీమిండియాలో ట్రైనింగ్ అసిస్టెంట్ అయ్యాడు.గత 13 ఏళ్లుగా, జట్టు విజయంలో రాఘవేంద్ర ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ వస్తున్నాడు.2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోహ్లీ రాఘవేందర్ రాఘవేంద్రను ప్రత్యేకంగా ప్రశంసించాడు.తన గెలుపు లో రాఘవేంద్ర చాలా పెద్ద పాత్ర పోషించాడు అని చెప్పాడు.
ఇండియాకు త్రోడౌన్ స్పెషలిస్టు అయిన రాఘవేంద్ర ఇప్పటిదాకా కనీసం ఓ మిలియన్ బంతులు విసిరి ఉంటాడు.కొన్నిసార్లు 150 కి.మీ వేగంలో బంతులు కూడా విసిరి ఆశ్చర్యపరిచేవాడట.ఏది ఏమైనా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు అతడు ఒక మంచి స్థాయికి వచ్చాడు టీమిండియా విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తూ తన కలను నెరవేర్చుకున్నాడు.