అగ్రరాజ్యాలలో ఒకటి, ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేయగల యూకేలో రెండ్రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.దీంతో అన్ని దేశాలు అత్యంత ఆసక్తిగా ఇక్కడి రాజకీయాలను గమనిస్తున్నాయి.
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ) నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడంతో మనదేశంలోనూ ఉత్కంఠ నెలకొంది.పైగా బిలియనీర్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు కావడంతో సునాక్‌పై కార్పోరేట్ ప్రపంచం కూడా దృష్టి సారించింది.
మిలియన్ల మంది ఓటర్లు గురువారం కొత్త హౌస్ ఆఫ్ కామన్స్, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఓటర్లు మొత్తం 650 మంది శాసనసభ్యులను ఎన్నుకుంటారు.
ఎక్కువ మంది చట్టసభ్యులు గెలిచిన పార్టీ నేత ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్( Conservative Party )లు దాదాపు 14 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు.దీంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతోంది.ఏళ్లుగా బ్రిటీష్ రాజకీయాలలో కన్జర్వేటివ్‌లు, లేబర్లు ఆధిపత్యం చెలాయిస్తుండటంతో చిన్న పార్టీలకు పార్లమెంట్లో ప్రాతినిథ్యం దక్కడం లేదు.
ఈ రెండు పార్టీలతో పాటు లిబరల్ డెమొక్రాట్లు, రిఫార్మ్ యూకే, నేషనల్ పార్టీ, గ్రీన్స్లు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్ ప్రధాని అభ్యర్ధిగా ఉంటే… లేబర్ పార్టీ నుంచి డాక్టర్ కీర్ స్టార్మర్ ( Keir Starmer )లు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
లిబరల్ డెమొక్రాట్స్ పార్టీ నుంచి ఎడ్ డేవీ.రిఫార్మ్ పార్టీ నుంచి నిగెల్ ఫరాజ్, స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) నుంచి జాన్ స్వినీ , గ్రీన్ పార్టీ నుంచి కార్లా డెనియర్, అడ్రియన్ రామ్సేలు ప్రధాన అభ్యర్ధులుగా ఉన్నారు.
అణుశక్తిని తగ్గించడం, 2040 నాటికి అది సున్నాకి చేరుకోవడం. గ్రీన్ హౌస్‌లను ఇన్సులేట్ చేయడానికి ఏడాదికి 24 బిలియన్ పౌండ్లు, గ్రీన్ ఎకానమీలో పెట్టుబడి పెట్టడానికి ఏడాదికి 40 బిలియన్ పౌండ్లను కార్బన్ పన్ను ద్వారా చెల్లించబడుతుందని హామీ ఇచ్చారు.కొత్త సంపన్నులు, అధిక ఆదాయం సంపాదించే వారికి పన్ను పెంపు వంటి వాగ్థానాలు చేశారు.