టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు వచ్చారు, వెళ్లిపోయారు.వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేశారు.
అలాంటి వారిలో తేజ( Director teja ) ఒకరు అని చెప్పుకోవచ్చు.ఈ దర్శకుడు మొదటగా సినిమా ఆటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించాడు.
తర్వాత చిత్రం, ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, జయం, నిజం, లక్ష్మీకళ్యాణం వంటి చిత్రాలు తీసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.ఈ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
అయితే తేజ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి.మనసులో ఏది ఉంటే అది బయటికి చెప్పేస్తుంటాడు.
అదే ఒకసారి అతని కొంపముంచింది.నిజాన్ని నిజంగా ఆయన బయటకు చెప్పినందుకు ఒక దిగ్గజ దర్శకుడు నొచ్చుకున్నారు.
అంతేకాదు మూవీ చాంబర్‌లో ఫిర్యాదు చేసి తేజ చేత కోటి రూపాయలు ఫైన్ కట్టించారు.ఆ దర్శకుడు మరెవరో కాదు దాసరి నారాయణరావు.
ఆ విషయంలోకి వెళ్తే, దాసరి( Dasari Narayana Rao ) ఒకసారి ఒక సినిమాకి దర్శకుడిగా పని చేస్తున్నారట.సినిమా సగమయ్యాక “ఈ మూవీ ఆడదు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయిపోతుంద”ని అని తేజ తనకనిపించింది చెప్పేసాడట.దాంతో దాసరి ఫీలయ్యారు.సినిమా రిలీజ్ అయ్యాక తేజ చెప్పినట్టే మూవీ ఫెయిల్ అయింది.దాంతో తేజపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు.తేజ మధ్యలోనే ఆ సినిమా గురించి నెగటివ్ గా చెప్పాడని, ఆ నెగెటివిటీ వల్లే ఈ సినిమా ఫెయిల్ అయిందని కంప్లైంట్ చేశారట.
ఆ ఫిర్యాదు కారణంగా సినిమా ఛాంబర్ వాళ్ళు తేజ చేత కోటి రూపాయలు కట్టించారట.ఈ విషయాన్ని స్వయంగా తేజ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ఇక దాసరి నారాయణరావు నిర్మాతగా తేజ దర్శకుడిగా ఒక సినిమా చేశారు.అదే ఒక V చిత్రం( Oka V Chitram ) ఈ మూవీ మాత్రం తనకు బాగా అనిపించిందని తేజ చెప్పాడు.
అయితే ఇది కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు.కోటి రూపాయల బడ్జెట్ తో తీస్తే ఎవరికీ ఏ నష్టాలు రాకుండా మూవీ బిజినెస్ చేయగలిగిందని, కలెక్షన్లను రాబట్టగలిగిందని తేజ చెప్పుకొచ్చాడు.
కోటి రూపాయలు కట్టినా సరే తాను ఇప్పటికీ హానెస్ట్ గానే రివ్యూలు చెప్తానని తేజ అంటున్నాడు.కొంతమంది దానిని నోటి దూల అనుకుంటారని కానీ తను చెప్పేవన్నీ నిజమే అని ఆయన తనను తాను సమర్థించుకున్నాడు.