కంటి చూపుకు అండగా ఉండే సూపర్ ఫుడ్స్ ఇవి.. మీ డైట్ లో ఉన్నాయా?

ప్రస్తుత ఆధునిక కాలంలో కంప్యూటర్ ముందు పని చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది.

 These Are Superfoods For Eyesight! Super Foods, Eyesight, Good Eyesight, Eye Car-TeluguStop.com

పిల్లల నుండి ముసలి వారి వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్( Smart phone ) దర్శనమిస్తోంది.అయితే స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మొదట ఎఫెక్ట్ అయ్యేది కళ్ళు.

ఈ మధ్య చాలా మందికి చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది.దీంతో కళ్లద్దాలపై ఆధారపడుతున్నారు.

అందుకే కంటి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల‌ని నిపుణులు చెతున్నారు.అయితే కంటి చూపుకు అండగా ఉండే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి కూర ( Lettuce, Spinach )కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పాల‌కూర‌, బ‌చ్చ‌లికూర‌లో విటమిన్‌ ఇ , విట‌మిన్ ఎ, విటమిన్ బి, విట‌మిన్‌ సి, ఐరన్, జింక్ వంటి పోష‌కాల‌తో పాటు లుటిన్ మరియు జియాక్సంతిన్ ( lutein and zeaxanthin )వంటి ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి.అందువల్ల వారానికి రెండు సార్లు ఈ ఆకుకూరలు తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది.

కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Telugu Carrot, Dry Fruits, Eggs, Eye Care, Eye, Fish, Tips, Latest, Orange, Sunf

అలాగే డ్రై ఫ్రూట్స్ కంటి ఆరోగ్యానికి అండగా ఉంటాయి.కంటిచూపును మెరుగు పరుస్తాయి.రోజుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )తినడం వల్ల కళ్లద్దాల పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

కంటి చూపును మెరుగుపరిచే సత్తా ఆరెంజ్ పండ్లకు ఉంటుంది.కంటి రెటీనా కు అవసరమయ్యే విటమిన్ ఎ ఆరెంజ్ పండ్లలో మెండుగా ఉంటుంది.

Telugu Carrot, Dry Fruits, Eggs, Eye Care, Eye, Fish, Tips, Latest, Orange, Sunf

కంటి ఆరోగ్యానికి పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ఒక సూప‌ర్ ఫుడ్ అని చెప్పుకోవ‌చ్చు.పొద్దుతిరుగుడు విత్త‌నాల్లో పుష్క‌లంగా ఉండే విటమిన్ ఇ కంటిలోని కణాలను ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్.అందువ‌ల్ల రోజుకు రెండు స్పూన్లు ఈ విత్త‌నాల‌ను తీసుకుంటే కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరం ఉండొచ్చు.అలాగే కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలు తృణధాన్యాల్లో స‌మృద్ధిగా ఉంటాయి.

ఆక్సీకరణ నష్టం మరియు వాపు నుండి కళ్ళను రక్షించడంలో తృణధాన్యాలు స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్వినోవా, పప్పులు, ఓట్స్ మరియు బ్రౌన్ రైస్ తినండి.

ఇక ఇవే కాకుండా బ్రోకలీ, క్యాప్సికమ్, క్యారెట్, గుడ్డు, చేపలు వంటి ఆహారాలు కూడా కంటి చూపును పెంచుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube