మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లు వినడానికి చాలా గమ్మత్తుగా సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి.అటువంటి వాటిలో విక్టరీ వెంకటేష్, నందమూరి బాలయ్య బాబు( Victory Venkatesh, Nandamuri Balayya Babu ) కాంబినేషన్ కూడా ఒకటి.
ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.కారణాలు ఏవైనా కానీ ఇప్పటివరకు అలాంటి ఆలోచన కూడా ఎవరు చేయలేదు.
కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి తెరపై తన అభిమానులకు ఆనందం కలగ చేయబోతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఇద్దరి హీరోలతో మంచి రాపో మెయింటైన్ చేస్తున్న అనీల్ రావిపూడి.కాగా వెంకటేశ్, అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కలయికలో ఒక చిత్రం రానున్న సంగతి తెలిసిందే.ఇందులో ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు.తాజాగా మరో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్( Aishwarya Rajesh ) ని తీసుకున్నట్లు తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి.
బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి, పూజలు చేశారు.ఇక ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలిస్ గా కనిపిస్తారు.
యాక్షన్, ఫన్ కలిగలిసి ఈ పాత్ర సాగుతుంది.
మరో ప్రక్క ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక అరగంట సేపు వచ్చే ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందట.ఆ పాత్రలో తాను బాలయ్యను తప్పించి మరొకరిని ఊహించుకోలేకపోతున్నారట అనీల్ రావిపూడి.అప్పటిదాకా ఫన్ తో పరుగెట్టే సినిమా ఆ అరగంట సేపు యాక్షన్ తో థియేటర్ ఊగిపోయేలా ప్లాన్ చేసారట.
ఇప్పటికే బాలయ్యకు ఈ పాయింట్ చెప్పి, గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట.అయితే డేట్స్ తక్కువే కాబట్టి బాలయ్య ఈ సినిమాకు మ్రొగ్గు చూపే అవకాసం ఉందంటన్నారు.
అదే జరిగితే వెంకటేష్, బాలయ్య కాంబో అంటే క్రేజ్ ఒక రేంజిలో వస్తుంది.ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది.ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) కనిపించనున్నారు.
ఈ నెల 3 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము.నవంబరులో పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు.