ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?

నాగ్ అశ్విన్, ప్రభాస్ ( Nag Ashwin, Prabhas )కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం కల్కి.ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Six Of The Top 10 Highest Grossing South Movies In Hindi Are Prabhas Movies, Six-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ అలాగే నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జూన్ 27న విడుదల అయిన ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు.అలాగే కల్కి సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది.

పాన్ ఇండియా మూవీ కల్కికి సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది.ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

కల్కి 2898 AD( Kalki 2898 AD ) విడుదలై 6 రోజులు అయ్యింది.ఆరు రోజులకు ఈ మూవీ రూ.625 కోట్లు రాబట్టింది.ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో 95.3 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.అయితే ఈ సినిమా హిందీలో తొలిరోజు 22.5 కోట్లు రాబట్టింది.రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది.

Telugu Baahubali, Hindi, Jawan, Kalki, Nag Ashwin, Prabhas, Yash-Movie

అలాగే మూడో రోజు ఈ వసూళ్లు రూ.26 కోట్లకు చేరాయి.ఇక నాల్గవ రోజు కల్కి హిందీ భాషలో 40 కోట్లు సాధించింది అయితే ఐదో రోజు సినిమా లెక్కల్లో భారీ తగ్గుదల కనిపించింది.హిందీలో కల్కి రూ.16.5 కోట్లు రాబట్టిందట.ఆరో రోజు రూ.14 కోట్ల బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది.ఓవరాల్ గా ఈ సినిమా హిందీలో ఇప్పటి వరకు రూ.142 కోట్లకు పైగా రాబట్టింది.అలా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సౌత్ సినిమాల జాబితాలో ప్రభాస్ 6 సినిమాలు ఉన్నాయి.అదే సమయంలో, బాహుబలి 2– ది కన్‌క్లూజన్, హిందీలో దక్షిణాదిలో అతిపెద్ద వసూళ్లు సాధించడమే కాకుండా జవాన్, గదర్ 2, పఠాన్ తర్వాత నాల్గవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది.

రెండవ స్థానంలో యష్ KGF: చాప్టర్ 2 నిలిచింది.ఆ తరువాత RRR మూడో స్థానంలో కొనసాగుతోంది.

కాగా కల్కి చిత్రం 6 రోజుల్లో హిందీలో 142 కోట్ల రూపాయలను దాటింది.అంటే త్వరలో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు చిత్రాల జాబితాలో ప్రభాస్ ఈ చిత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోనుందన్నమాట.

Telugu Baahubali, Hindi, Jawan, Kalki, Nag Ashwin, Prabhas, Yash-Movie

అయితే మొదటి మూడు సినిమాల రికార్డును బద్దలు కొట్టాలంటే చాలా వసూల్ చేయాలి ఈ సినిమా.ప్రభాస్ సినిమా టాప్ 3 స్థానానికి చేరుకోవాలంటే RRRని బీట్ చేయాలి.ఈ సినిమా హిందీ వసూళ్లు 272 కోట్లు.యష్ KGF 2 టాప్ 2 స్థానాన్ని ఆక్రమించింది.దీన్ని బద్దలు కొట్టాలంటే ఈ సినిమా రూ.435 కోట్లకు పైగా బిజినెస్ చేయాల్సి ఉంటుంది.బాహుబలి 2 టాప్ పొజిషన్‌ను అందుకోవాలంటే కల్కి రూ.511 కోట్లకు పైగా రాబట్టాలి.మరి ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube