ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?

నాగ్ అశ్విన్, ప్రభాస్ ( Nag Ashwin, Prabhas )కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం కల్కి.

ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ అలాగే నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జూన్ 27న విడుదల అయిన ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.

మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.

555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు.అలాగే కల్కి సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది.పాన్ ఇండియా మూవీ కల్కికి సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది.

ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

కల్కి 2898 AD( Kalki 2898 AD ) విడుదలై 6 రోజులు అయ్యింది.

ఆరు రోజులకు ఈ మూవీ రూ.625 కోట్లు రాబట్టింది.

ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో 95.3 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

అయితే ఈ సినిమా హిందీలో తొలిరోజు 22.5 కోట్లు రాబట్టింది.

రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది. """/" / అలాగే మూడో రోజు ఈ వసూళ్లు రూ.

26 కోట్లకు చేరాయి.ఇక నాల్గవ రోజు కల్కి హిందీ భాషలో 40 కోట్లు సాధించింది అయితే ఐదో రోజు సినిమా లెక్కల్లో భారీ తగ్గుదల కనిపించింది.

హిందీలో కల్కి రూ.16.

5 కోట్లు రాబట్టిందట.ఆరో రోజు రూ.

14 కోట్ల బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది.ఓవరాల్ గా ఈ సినిమా హిందీలో ఇప్పటి వరకు రూ.

142 కోట్లకు పైగా రాబట్టింది.అలా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సౌత్ సినిమాల జాబితాలో ప్రభాస్ 6 సినిమాలు ఉన్నాయి.

అదే సమయంలో, బాహుబలి 2- ది కన్‌క్లూజన్, హిందీలో దక్షిణాదిలో అతిపెద్ద వసూళ్లు సాధించడమే కాకుండా జవాన్, గదర్ 2, పఠాన్ తర్వాత నాల్గవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది.

రెండవ స్థానంలో యష్ KGF: చాప్టర్ 2 నిలిచింది.ఆ తరువాత RRR మూడో స్థానంలో కొనసాగుతోంది.

కాగా కల్కి చిత్రం 6 రోజుల్లో హిందీలో 142 కోట్ల రూపాయలను దాటింది.

అంటే త్వరలో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు చిత్రాల జాబితాలో ప్రభాస్ ఈ చిత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోనుందన్నమాట.

"""/" / అయితే మొదటి మూడు సినిమాల రికార్డును బద్దలు కొట్టాలంటే చాలా వసూల్ చేయాలి ఈ సినిమా.

ప్రభాస్ సినిమా టాప్ 3 స్థానానికి చేరుకోవాలంటే RRRని బీట్ చేయాలి.ఈ సినిమా హిందీ వసూళ్లు 272 కోట్లు.

యష్ KGF 2 టాప్ 2 స్థానాన్ని ఆక్రమించింది.దీన్ని బద్దలు కొట్టాలంటే ఈ సినిమా రూ.

435 కోట్లకు పైగా బిజినెస్ చేయాల్సి ఉంటుంది.బాహుబలి 2 టాప్ పొజిషన్‌ను అందుకోవాలంటే కల్కి రూ.

511 కోట్లకు పైగా రాబట్టాలి.మరి ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో చూడాలి మరి.

ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న సాయిపల్లవి.. ఇకపై డాక్టర్ సాయిపల్లవి అంటూ?