1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించిన హుస్సేన్ సాగర్ ( Hussain Sagar Lake )హైదరాబాద్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.హృదయాకారంలో ఉండే ఈ సరస్సుకి ఆర్కిటెక్చర్ మాస్టర్ హుస్సేన్ షా వలీ పేరు పెట్టారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణానికి ముందు ఇది నీటి సరఫరాకు ప్రధాన వనరు.ఇక హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని 1992లో ఏర్పాటు చేశారు అప్పటి ప్రభుత్వం.
ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కాబట్టి, హైదరాబాద్ సెయిలింగ్ వీక్( Hyderabad Sailing Week ) ప్రతి సంవత్సరం సరస్సు వద్ద నిర్వహిస్తారు.ఇది హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సరస్సులో నిర్వహించబడే వార్షిక కార్యక్రమం.
తాజాగా మొదలైన ఈవెంట్ 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్.
హుస్సేన్ సాగర్ లేక్‌లో మంగళవారం హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభమైంది.దీనిని లెఫ్టినెంట్ జనరల్ JS సిదానా, డైరెక్టర్ జనరల్, EME, సీనియర్ కల్నల్ కమాండెంట్, EME సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫ్లాగ్ ఆఫ్ చేసారు.ప్రతిసారి ఈ ఈవెంట్ ను EME సెయిలింగ్ అసోసియేషన్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.
ఇక ఈ పోటీలు YAI ర్యాంకింగ్ ఈవెంట్ గా పనిచేస్తుంది.ఇందులో వివిధ క్యాటగిరీలలో పోటీలు ఉంటాయి.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, హర్యానా ఇలా అనేక ఇతర రాష్ట్రాల నుండి సుమారు 100 మంది నావికులు పోటీలలో పాల్గొంటారు.ఈ కార్యక్రమం జూలై 7న బహుమతుల పంపిణీతో ముగిస్తుంది.సంవత్సరానికి ఒకసారి జరిగే ఈవెంట్ ను నిర్వహకులు చాలా ఘనంగా నిర్వహిస్తారు.కాబట్టి నగరవాసులు వీలైతే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రయత్నం చేయండి.ఇప్పుడు ఈ ఈవెంట్ మిస్ అయితే మరో ఏడాది వరకు వేచి చూడాల్సిందే.