ఇటీవల పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) సమయంలో సంధ్య థియేటర్ ( Sandhya Theatre )వద్ద జరిగిన సంగతి గురించి మనందరికీ తెలిసిందే.తొక్కిసలాట సమయంలో రేవతి అనే మహిళ చనిపోయింది.
ఆమె కొడుకు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు.పుష్ప సినిమాకి వెళ్లి కొడుకుని అలాగే భార్యని కోల్పోవడంతో దు:ఖంలో ఆ భర్త ఉన్నాడు.ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని బన్నీ భరోసా ఇచ్చాడు.తక్షణ సాయం కింద రూ.25 లక్షలు ప్రకటించాడు. అయితే ఈ ఘటన మీద తాజాగా ఆర్జీవీ స్పందించాడు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన అవాంఛనీయమైన ఈ ఘటనకు అల్లు అర్జున్‌ని బాధ్యుడ్ని చేయడం ఓ పిచ్చి చర్చ.సెలెబ్రిటీలు బయటకు వస్తే ఇలానే జనాలు గుమిగూడుతారు పెద్ద ఎత్తున వస్తారు ఇలా పెద్ద ఎత్తున జనాలు వచ్చినప్పుడు తొక్కిసలాట జరుగుతుంది.

అది కామన్ ఇలాంటి ఘటనలు ఇప్పుడే కొత్తగా జరిగాయి.ఈ దేశంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయి ఎన్నో వేల మంది చనిపోయారు.అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగింది? కావాలనే చేశారా? ఇదంతా ఎలా జరిగింది? అనేది కేసుని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది.వేల మంది చనిపోయినప్పుడు ఏ ఒక్కరూ ఏ ఒక్కరి మీద నిందలు వేయలేదు.
ఇప్పుడు బెనిఫిట్ షోలను రద్దు చేయడం అనేది పరిష్కారం, సమాధానం కాదు.కొన్ని సందర్భాల్లో ఛారిటీ నిధుల కోసం కూడా బెనిఫిట్ షోలు వేసిన సందర్భాలు ఉన్నాయి.
అసలు బెనిఫిట్ షోలు అంటేనే హైప్‌ని, క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి అని తెలిసిందే.ముందు చూడాలన్న ఆ ఎగ్జైట్మెంట్ కోసం బెనిఫిట్ షోలు పెడతారు.
అసలు వాటికి స్పెషల్ షో అని పెట్టాలి.

స్పెషల్ కాఫీ, స్పెషల్ టీకి ఎలా అయితే డబ్బు ఎక్కువ పెడతామో.స్పెషల్ షోకి కూడా ఎక్కువ టికెట్లు ఉంటాయి.ర్యాలీలకు, మీటింగ్‌లకు ఎలా అయితే పర్మిషన్స్ ఇస్తారో.
అలానే ఈ స్పెషల్ షలకు పర్మిషన్స్ ఇచ్చారు.అల్లు అర్జున్ గానీ అతని టీం గానీ థియేటర్‌కు వస్తున్నామనేది బయటకు లీక్ ఇస్తే.
అప్పుడు పోలీసులే అతడ్ని రావొద్దని చెప్పాలి.కానీ వాళ్లు అంతగా పట్టించుకోలేదు.
ఇంత మంది జనం వస్తారని వాళ్లు కూడా ఊహించలేదు.