టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Star hero Prabhas )కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ప్రస్తుతం ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ప్రభాస్ ఉన్నారనే సంగతి తెలిసిందే.
హూంబాలే బ్యానర్ లో ప్రభాస్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలలో ఒక సినిమాకు రిషబ్ శెట్టి( Rishabh Shetty ) కథ అందిస్తున్నారని సమాచారం అందుతోంది.
ప్రభాస్ సినిమాకు రిషబ్ కథ అందిస్తే అంచనాలు మామూలుగా ఉండవు.
ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ప్సమాచారం అందుతోంది.
ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడానికి కనీసం ఐదారేళ్ల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.ప్రభాస్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తుండటంతో పాటు బాలీవుడ్( Bollywood ) బ్యూటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రిషబ్ శెట్టి కథ అందిస్తే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనే చర్చ సైతం జరుగుతోంది.

ప్రభాస్ సినిమాలు ఇప్పటికే భాషతో సంబంధం లేకుండా సంచలనాలు సృష్టిస్తుండగా భవిష్యత్తు సినిమాలు సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రభాస్ పారితోషికం సైతం ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ ( 200 crore range )లో ఉందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూనే తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే రికార్డులు సాధిస్తున్నారు.బాలీవుడ్ లో సైతం ప్రభాస్ సినిమాలు భారీగా కలెక్షన్లను సాధిస్తున్నాయి.ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ప్రభాస్ రిషబ్ శెట్టి మూవీ సంచలన రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.