పుష్ప ది రూల్ సినిమా( pushpa the rule movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఈ సినిమాకు ఏకంగా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తోంది.బాక్సాఫీస్ వద్ద నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ సినిమా గురించి ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే రోజా ( Former MLA Roja )తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆమె కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
పుష్ప ది రూల్ మూవీ అంచనాలను మించిన చిత్రం అని రోజా పేర్కొన్నారు.పుష్పతో తగ్గేదేలే అన్నారని పుష్ప2 సినిమాతో అస్సలు తగ్గేదేలే అని అనిపించారని ఆయన చెప్పుకొచ్చారు.చిత్తూరు యాసను వెండితెరపై పుష్ప ది రూల్ మూవీలో పలికిన తీరు హాల్ లో ఈలలు వేయిస్తోందని రోజా తెలిపారు.పుష్ప2 సినిమాలో బన్నీ నటన అద్భుతమని బన్నీ మాస్ ఇమేజ్ తో యావత్ దేశాన్ని షేక్ చేశారని రోజా వెల్లడించారు.

పుష్ప అంటే ఫ్లవర్ కాదని ఫైర్ అని వైల్డ్ ఫైర్ అని పూనకాలు పెట్టించారని రోజా పేర్కొన్నారు.మా తిరుపతి గంగ జాతర పుష్ప ది రూల్ సినిమాకు హైలెట్ అనిపించిందని రోజా తెలిపారు.మీ శ్రమకు తగ్గ ఫలితమే ఈ సినిమా విజయం మొత్తం యూనిట్ కు శుభాకాంక్షలు అని రోజా పేర్కొన్నారు. సుకుమార్ ( Sukumar )చిత్తూరు యాసను గ్లోబల్ స్క్రీన్ పై చిందులేయించారని రోజా చెప్పుకొచ్చారు.

బాక్సాఫీస్ బద్దలుగొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయని ఆమె వెల్లడించారు.తిరుపతి గంగజాతరను జగన్ సర్కార్ రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించారని రోజా పేర్కొన్నారు.రష్మిక సూపర్ అంటూ రోజా స్పెషల్ రివ్యూ ఇచ్చారు.రోజా ఇచ్చిన రివ్యూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.మా చిత్తూరు యాసలో చెప్పాలంటే రేయ్ మచ్చా ఎవడ్రా ఈడు అనుకునేలా చేశారని రోజా పేర్కొన్నారు.