సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు (Mohan Babu)ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఆయన ఒకప్పుడు విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల బాధ్యతలను కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తన కొడుకులను కూడా క్రమశిక్షణ అంటూ చాలా పద్ధతిగా పెంచిన విషయం మనకు తెలిసిందే.ఇక నిన్న మంచు మనోజ్(Manchu Manoj) మీద మోహన్ బాబు దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి.

దానికి తగ్గట్టుగానే మనోజ్ ఈ విషయం మీద ఎలాంటి స్పందనను తెలియజేయకపోయినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోహన్ బాబు తన కొడుకు మీద విపరీతంగా దాడి చేయించినట్టుగా తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఇద్దరినుంచి ఎలాంటి సమాధానం అయితే రావడం లేదు.కాబట్టి ఈ గొడవ ఇంకా ఎక్డి వరకు వెళ్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే వీళ్ళ మధ్య గొడవ రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ల విద్యాసంస్థల విషయంలోనే అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోంది.
అలాగే ఆస్తి పంపకాల విషయంలో కూడా మోహన్ బాబు అనుసరిస్తున్న వైఖరి మనోజ్ కి నచ్చడం లేదట.దానివల్ల వీళ్ళ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇద్దరి కొడుకులకు సమానమైన ఆస్తిని పంచి ఇవ్వడానికి మోహన్ బాబు(Mohan Babu) ప్రయత్నం చేస్తున్నప్పటికి ఏవో చిన్న చిన్న కారణాలవల్ల వాళ్ల మధ్య గొడవలైతే వస్తున్నాయంటూ మోహన్ బాబు సన్నిహిత వర్గాల నుంచి కొంతవరకు సమాచారం అయితే అందుతుంది…ఇక ఇదిలా ఉంటే ఈ విషయం మీద మంచి విష్ణు మాత్రం ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు… ఇక కారణం ఏదైనా కూడా ఇలా గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటూ సినీ పెద్దలు వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…
.