పెళ్లిళ్లు.పేరంటాలు. బారసాలలు.తొట్టెల వేడుకలు.నూతన వస్త్రాలంకరణ మహోత్సవాలు.పుట్టిన రోజులు.
నిత్యం ఎన్నో ఫంక్షన్లు జరుగుతుంటాయి.మనందరం.
మన బంధువుల వేడుకలకు వెళ్తూ ఉంటాం కూడా.అక్కడ ఏదో మనకు తోచినంత కట్నం చదివించి వస్తాం.
డబ్బున్నోళ్లు వేలకు వేలు చదివిస్తే.పేద, మధ్య తరగతి జనాలు నూట పదహారో.
రెండు వందల పదహారో చదివిస్తారు.అయితే వందల లేదంటే రెండు వందలు.
లేదంటే ఐదు వందలు చదివించ వచ్చు కదా.చివరకు 16 ఎందుకు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకీ అలా ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
116, 516, 1,116 కట్నాలు చదివించడం అనాదిగా మన పూర్వీకుల నుంచే వస్తుంది.మన పెద్దలు అలాగే చదివించారు కాబట్టి.
మనం కూడా అలాగే ఇవ్వాలని అనుకుంటున్నాం.ఈ సంప్రదాయం కొన్ని వందల సంవత్సరాలుగా వస్తూ ఉంది.
మామూలుగా చివరకు సున్నా ఉన్న సంఖ్యతో కట్నాలు ఇవ్వరు.అయితే ఒకటి, రెండు, మూడు, నాలుగు ఉండవచ్చు కదా.ఎందుకు 16 ఉండేలా ఇస్తున్నారు? అంటే దానికి ఓ లెక్కుంది.గతంలో మన దేశాన్ని ఆంగ్లేయులు పాలించారు.
ఆ సమయంలో వంద రూపాయలు మార్చుకుంటే 16 రూపాయలు తక్కువగా ఇచ్చేవారు. దీంతో అలా తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతోనే 16 రూపాయలను కలిపి ఇచ్చేలా ఆ నాడు సంప్రదాయంగా ఉండేది.
ఆది చివరకు ఆచారంగా మారింది.అందుకే ఏ వేడుకకు వెళ్లినా.116, 516, 1,116 రూపాయలుగా కట్నాలు చదివించడం వస్తుంది.
అంతేకాదు.నిజాం పరిపాలనతో పోల్చితే ఆంధ్రాప్రాంతం వారి లెక్కలు సైతం తేడాగా ఉండి.నిజాం ప్రాంతం వారు ఆంధ్రా ప్రజలకు చెల్లింపులు చేసేటప్పుడు వందకి 116 చెల్లిస్తేనే సమానం అయ్యేది.
నిజాం పాలనలోని ప్రజలు వాడే మారకం విలువ తక్కువగా ఉండేది.అందుకే వంద రూపాయలు చెల్లించాలి అంటే అదనంగా మరో 16 రూపాయలు యాడ్ చేయాల్సి ఉండేది.
మొత్తంగా ఈ 16 రూపాయలకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.