ఎవరూ ఊహించని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సోదరుడు, ఆ పార్టీ కీలక నేత కొణిదల నాగబాబుకు( Konidela Nagababu ) మంత్రి పదవి ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు.వాస్తవంగా నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని అంతా భావించారు.
అయితే చివరి నిమిషంలో అనేక సమీకరణాల నేపథ్యంలో నాగబాబుకు అవకాశం దక్కలేదు.అయితే మంత్రిగా( Minister ) అవకాశం ఇవ్వబోతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అక్కడ సీఎం రమేష్ కు బిజెపి తరఫున అవకాశం దక్కడం తో నాగబాబు త్యాగం చేశారు.

ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు నాగబాబుకు కేటాయించే శాఖ ముహూర్తం కూడా ఖరారు అయింది.నాగబాబు ప్రస్తుతం ఏ సభలోను సభ్యుడుగా లేడు.కేవలం జనసేన పార్టీ( Janasena ) పదవిలోనే ఆయన కొనసాగుతున్నారు.అయితే ప్రస్తుతం మండలిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.కానీ వారి రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు.
మండలి చైర్మన్ వద్ద అవి పెండింగ్ లో ఉన్నాయి.ఇక మార్చిలో మరి కొంతమంది ఎమ్మెల్సీలు పదవి విరమణ చేయనున్నారు.దీంతో ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా,

ఆరు నెలల లోగా మండలి సభ్యుడు అయ్యేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు( Chandrababu ) నిర్ణయించుకున్నారు .ఇప్పటికే నాగబాబు తోనూ పవన్ కళ్యాణ్ తోనూ ఈ విషయంపై చర్చించి ఆ తర్వాతే చంద్రబాబు ప్రకటన చేశారు.మెగా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్న ముహూర్తం మేరకు ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించుకున్నారు.
రాజ్ భవన్ లో నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండనుంది. మెగా కుటుంబ సభ్యులు మూడు పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ప్రస్తుతం అన్ని శాఖలకు మంత్రులకు ఖరారు అయ్యాయి.అయతే నాగబాబుకు ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న సినిమాటోగ్రఫి శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం .