కెనడాలో దారుణం జరిగింది.శుక్రవారం ఎడ్మాంటన్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న 20 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని ఓ ముఠా కాల్చి చంపింది.
మృతుడిని హర్షన్ దీప్ సింగ్‌గా(Harshan Deep Singh) గుర్తించారు.ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్) ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
శుక్రవారం ఈ హత్య జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage)చెబుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ భవనంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందింది.మెట్ల మార్గంలో హర్షన్ సింగ్ పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు అతనికి ప్రథమ చికిత్స చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
ముగ్గురు సభ్యుల ముఠాలోని ఒక వ్యక్తి సింగ్‌ను మెట్లపై నుంచి క్రిందకి తోస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సీసీటీవీ ఫుటేజ్‌లో(CCTV footage) కనిపించింది.ఈ ఘటనకు సంబంధించి ఇవాన్ రైన్, జుడిత్ సాల్టోక్స్‌లను(Ivan Raine, Judith Saltaux) పోలీసులు అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం హర్షన్ సింగ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
కాగా.ఓ భారత సంతతి వ్యక్తి కెనడాలో(Canada) హత్యకు గురికావడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండవది.అంతకుముందు డిసెంబర్ 1న అంటారియోలోని లాంబ్టన్ కాలేజీలో మొదటి సంవత్సరం బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్ధి గురాసిస్ సింగ్ (22) తన రూమ్ మేట్ చేతుల్లోనే హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించి 36 ఏళ్ల క్రాస్టీ హంటర్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సర్నియా పోలీసుల కథనం ప్రకారం.డిసెంబర్ 1న తెల్లవారుజామున 4.59 గంటలకు కత్తిపోటుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది.ఇద్దరు వ్యక్తులు అపార్ట్‌మెంట్ లోపల గొడవకు దిగారని.అది తీవ్ర రూపు దాల్చి కొట్టుకునే వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో హంటర్ కత్తితో గురాసిస్ సింగ్‌ను విచక్షణారహితంగా పొడిచినట్లు చెప్పారు.