మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో విభేదాలు చోటు చేసుకున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.గతంలో కూడా ఓ సందర్భంలో మంచి విష్ణు (Manchu Vishnu) స్వయంగా మనోజ్ (Manoj) పై దాడి చేశారు.
అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదొక రియాలిటీ షో కోసమే చేస్తున్నాము అంటూ విష్ణు కవర్ చేసినప్పటికీ ఈ ఫ్యామిలీలో తగాదాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది.అయితే తాజాగా మరోసారి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆస్తి విషయంలో మనోజ్ పై దాడి చేయించారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ దాడిలో భాగంగా మంచు మనోజ్ తీవ్రంగా గాయాలు పాలయ్యారని ఈయన హాస్పిటల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.ఇలా హాస్పిటల్ కి వెళ్లిన సమయంలో కొన్ని టెస్టులను చేశారని తెలుస్తోంది.తాజాగా ఈ రిపోర్ట్స్ రావడంతో మంచు మనోజ్ వెన్నెముకకు గాయమైనట్లు ఈ రిపోర్ట్స్ వెల్లడించాయి.అదేవిధంగా ఆయన కడుపులో కూడా గాయమైందని అదేవిధంగా మెడపై గోటితో గీకిన ఘాట్లు కూడా ఉన్నాయని మెడికల్ లీగల్ రిపోర్ట్ వెల్లడించింది.

ఈ విధంగా మంచో మనోజ్ గాయల పాలయ్యారనే విషయం తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే విద్యానికేతన్ స్కూల్ కి సంబంధించిన ఆస్తి విషయంలో వీరి మధ్య గొడవలు జరిగిందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ అలాంటిదేమీ లేదు అంటూ మోహన్ బాబు పిఆర్ టీమ్ ఈ వార్తలను ఖండిస్తోంది.ఇక మంచు విష్ణు సైతం మనోజ్ ఇంటి చుట్టూ దాదాపు 30 మంది ప్రవేట్ బౌన్సర్స్ ని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా మంచు మనోజ్ గాయాలు పాలు అయ్యారు అనే విషయం తెలిసిన విష్ణు తన ఇంటికి వెళ్తున్నారంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మరి మంచు విభేదాల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో అసలు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.