అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఇక మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఇక ఈ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానులు ప్రేక్షకులు సెలబ్రిటీలు కూడా తరలివస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రముఖ సంచలనాత్మక జ్యోతిష్యులు వేణు స్వామి (Venu Swamy) ఆయన సతీమణి వీణ వాని (Veena Vani) తో కలిసి ఈ సినిమా చూశారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే వీణా వాణి సోషల్ మీడియా వేదికగా పుష్ప 2 సినిమా గురించి తన అభిప్రాయాలను బయటపెట్టారు.

ఈ సందర్భంగా ఈమె ఒక వీడియోని షేర్ చేస్తూ తాను ఇప్పుడే పుష్ప2(Pushpa2) సినిమా చూసి వచ్చానని తెలిపారు.తాను తనుకు నచ్చిన అలాగే నచ్చకపోయినా విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటానని తెలిపారు.ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలిపారు.
కళామతల్లి ఆశీస్సులతో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా నటించారు.ముఖ్యంగా జాతర సీన్ తనకు ఎంతో బాగా నచ్చిందని , ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన విశ్వరూపం చూసానని తెలిపారు.

కళామతల్లి ఆశీస్సులు ఉండటం వల్లే అల్లు అర్జున్ అంత గొప్పగా నటించారని తెలిపారు.ఇప్పట్లో ఈయనకు తిరుగు లేదని వెంటనే మీరు ఒక 100 గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోండి అల్లు అర్జున్ గారు అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.మొదటిసారి థియేటర్లో నాకు సినిమా అప్పుడే అయిపోయిందా అని అనుభూతి కలిగిందని తెలిపారు.సుకుమార్ గారు ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని తెలిపారు.
అల్లు అర్జున్ గారు మీరు రెండోసారి నేషనల్ అవార్డు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.