ఈ కారు కొంటే చాలా సేఫ్‌.. ఎటువంటి యాక్సిడెంట్ అయినా బతికిపోతారు?

కారులో పయనించడం అనేది ఇక్కడ ప్రతీ ఒక్కడి కల.అయితే నేటి దైనందిత కాలంలో అనేక కార్ ప్రమాదాలను మనం చూస్తూ ఉన్నాము.

 Is This Car Very Safe To Buy? Will It Survive Any Accident?, Best Cars, Latest N-TeluguStop.com

ఒక సర్వే ద్వారా తేలింది ఏమిటంటే… ప్రతిఏటా దేశంలో కొన్ని వేలమంది కారు ప్రమాదాల (Car accidents)బారిన పడి మరణిస్తున్నారని సమాచారం.ఈ క్రమంలోనే వినియోగదారులు ధరలు ఎక్కువైనా పయనించడానికి సేఫ్ కలిగిన వాహనాలనే కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఇదే విషయంలో చాలామంది ఔత్సాహికులు తొందరపడుతూ ఉంటారు.ఏవో రివ్యూలను చదివేసి కొనకూడని కార్లను కొనేస్తూ చిక్కుల్లో పడుతూ ఉంటారు.

ఈ తరుణంలోనే అత్యంత సురక్షితమైన కార్ల కంపెనీగా వోల్వో కార్లు(Volvo Cars) ప్రసిద్ధి చెందాయి.

Telugu Crash, Cars, Car, Latest, Mahindra Cars, Tata, Volvo Cars-Latest News - T

అంతర్జాతీయ మార్కెట్‌లో వాల్వో సంస్థకు చెందిన కార్లు ఎటువంటి పాపులారిటీని సంపాదించాయో అందరికీ తెలిసినదే.భారతీయ మార్కెట్‌లో కూడా వోల్వో కార్లు(Volvo Cars) అమ్మకాలు రానురాను పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే వోల్వో సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు సైతం మంచి డిమాండ్‌ ఇక్కడ ఉంది.

కాగా దేశంలో టాటా, మహీంద్రా కార్ల(Tata ,Mahindra cars) వలె వోల్వో కార్లు కూడా ప్రపంచ వ్యాప్తంగా సేఫెస్ట్‌ కార్లుగా పేర్లు తెచ్చుకున్నాయి.తాజాగా మరో వోల్వో కారు క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించినట్టు సర్వేలు చెబుతున్నాయి.

Telugu Crash, Cars, Car, Latest, Mahindra Cars, Tata, Volvo Cars-Latest News - T

అవును, తాజాగా నిర్వహించిన యూరో క్రాష్‌ టెస్ట్‌లో వోల్వో కొత్త ఎలక్ట్రిక్ కారు ‘EX30’ 5 స్టార్‌ రేటింగ్‌తో దుమ్ముదులిపింది.కాగా ఈ వోల్వో కారును భారతదేశంలో కూడా విక్రయించాలని కంపెనీ చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ఫలితాల వల్ల కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది.ఎందుకంటే దీని ద్వారా సేల్స్‌ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలోనే భారత్‌లో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ని నిర్వహిస్తున్నారు.భారత్‌లో అడుగుపెట్టే ప్రతీ కారుని BNCAPలో పరీక్షించవచ్చన్నమాట.

అయితే, ఈ వోల్వో యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది.యూరో క్రాష్ టెస్ట్‌లో గతంలోనూ వివిధ వోల్వో కార్లను పరీక్షించారు.

ఈ వోల్వో స్వీడిష్ కార్ల కంపెనీగా ఉంది.దీంతో వోల్వో ఈఎక్స్ 30 ఎలక్ట్రిక్ కారుని యూరో NCAP క్రాష్‌ టెస్ట్‌లో పరీక్షించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube