2024 సంవత్సరంలోని బిగ్గెస్ట్ హిట్లలో పుష్ప ది రూల్ (pushpa the rule)ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు.భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలకు నుంచి మెప్పించింది.
నార్త్ ఇండియాలో (North India)ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఇండస్ట్రీవర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కూడా కష్టమవుతుందని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ మూవీ సులువుగానే 1700 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి (Tollywood industry)చెందిన సెలబ్రిటీల నుంచి మాత్రం ఈ సినిమాకు ప్రశంసలు లభించడం లేదు.
ఇటు బన్నీ (Bunny)ప్రతిభను కానీ అటు సుకుమార్(Sukumar) ప్రతిభను కానీ ఎవరూ ప్రశంసించడం లేదు.టాలీవుడ్ హీరోలకు ఎందుకు ఇంత కుళ్ళు అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా అల్లు అర్జున్ ఇతర హీరోల సినిమాలు రియాక్ట్ అయ్యే విషయంలో ముందు వరుసలో ఉంటారు.అలాంటి హీరో సినిమా సక్సెస్ సాధిస్తే ప్రశంసించడానికి స్టార్ హీరోలకు మనసు రావడం లేదు.ఈ తరహా వాతావరణం ఇండస్ట్రీకి మంచిది కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.రాబోయే రోజుల్లో అయినా టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి స్పందన వస్తుందేమో చూడాలి.

బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బన్నీకి ప్రశంసలు దక్కుతుండగా టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం సైలెంట్ అవుతున్నారు.బన్నీ త్రివిక్రమ్ కాంబో(Bunny Trivikram combo) మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతోంది.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ సరికొత్త రికార్డులు క్రియిఎట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.2026 సంవత్సరంలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.పుష్ప ది రూల్ (pushpa the rule)సక్సెస్ బన్నీ కి ఎంతో సంతోషాన్ని కలిగించిందని సమాచారం అందుతోంది.