పుష్ప ది రూల్ ( Pushpa The Rule )సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విలన్ పేరు భన్వర్ సింగ్ షెకావత్ అనే సంగతి తెలిసిందే.
అయితే ఫహద్ ఫాజిల్ పేరు తాజాగా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.రాజ్‌పుత్ సంఘం నాయకుడు రాజ్ షెకావత్ ( Raj Shekawat )మాట్లాడుతూ సినిమాలో షెకావత్ రోల్ క్షత్రియ సమాజాన్ని అవమానించేలా ఉందని కామెంట్లు చేశారు.
పుష్ప ది రూల్ సినిమాలో షెకావత్ రోల్ నెగిటివ్ గా ఉందని రాజ్ షెకావత్ చెప్పుకొచ్చారు.పుష్ప ది రూల్ నిర్మాతలను కొట్టడానికి కర్ణి సేన( Karni Sena ) సిద్ధంగా ఉండాలని షెకావత్ పేర్కొన్నారు.
సినిమాలో షెకావత్ అనే పాత్రను అవమానించడం అంటే క్షత్రియ సమాజాన్ని అవమానించడమే అవుతోందిన కర్ణిసేన చెబుతుండటం గమనార్హం.సినిమా నుంచి ఆ పదాన్ని తొలగించాలని కర్ణి సేన పేర్కొంది.

పుష్ప ది రూల్ సినిమాలో ‘షెకావత్’ కమ్యూనిటీని హీనంగా ప్రదర్శించారని ఆయన తెలిపారు.అవసరమైతే ఎంతదూరమైనా వెళతామని రాజ్ షెకావత్ అని వెల్లడించారు.ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.పుష్ప ది రూల్ మేకర్స్ ఈ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పుష్ప ది రూల్ సినిమా రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 806 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సులువుగానే ఏకంగా 1000 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
పుష్ప ది రూల్ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.