అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump as US President) విజయం సాధించడంతో అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.ప్రస్తుతం తన కేబినెట్‌ను, ఇతర కీలక యంత్రాంగాన్ని సెట్ చేసే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు.
ఇక వలసదారులను ఏమాత్రం సహించని ట్రంప్.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఇప్పటికే అమెరికాలో ఉన్న వలసదారులతో పాటు అక్కడికి వెళ్లాలని కలలు కంటున్న వారు బిక్కుబిక్కుమంటున్నారు.
వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాక అక్రమ వలసదారులను బహిష్కరించే ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు.అలాగే చట్టబద్ధంగా వలసదారులు అమెరికాలో అడుగుపెట్టే విధానాన్ని సులభతరం చేస్తానని చెప్పారు.
అయితే ట్రంప్ (Trump )నిర్ణయాల వల్ల భారతీయులకు మేలు కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎన్‌బీసీ ఛానెల్‌కు(NBC channel) ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్రమ వలసదారుల వల్ల చట్టబద్ధంగా అమెరికాలో అడుగుపెట్టాలని 10 ఏళ్లుగా కలలు కంటున్న వారికి అన్యాయం జరిగిందని ట్రంప్ అన్నారు.హత్యలకు పాల్పడే వారు మాకొద్దని.గడిచిన మూడేళ్లలో దేశంలోకి 13,099 మంది హంతకులు విడుదలై , వీధుల్లో నడుస్తున్నారని ఆయన చెప్పారు.సమాజానికి, అమెరికన్లకు (Americans)ఇలాంటి వ్యక్తులు ప్రమాదకరమైని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి నేరస్తులను తరిమి కొట్టాలని.ఏదేమైనా బహిష్కరణ అనేది తన మొదటి ప్రాధాన్యత అని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.
తొలుత నేరస్థులను దేశం నుంచి బహిష్కరించి తర్వాత ఇతరులకు వర్తింపజేస్తామని ట్రంప్ అన్నారు.మా వీధుల్లో, మా పొలాల్లో అనేక మందిని హత్య చేసిన వారిని దేశం నుంచి బయటికి పంపాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా.ఇమ్మిగ్రేషన్ విధానంలో ట్రంప్ గతంలో అనుసరించిన విధానాల దృష్ట్యా అమెరికన్ విశ్వవిద్యాలయాలు జాగ్రత్త పడుతున్నాయి.ఈ భయాలతో పలు అతమెరికన్ వర్సిటీలు తమ అంతర్జాతీయ విద్యార్ధులు, సిబ్బందికి ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి.ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ముందే (జనవరి 20 లోగా) యూఎస్‌కి తిరిగి రావాలని కోరాయి.