రామ్ పోతినేని హిందీలో నంబర్ వన్ హీరోనా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ( Telugu film industry ) ఇండియన్ సినిమాలలో మొదటి వరుసలో ఉన్న విషయం తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉండడంతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమలో ఎక్కువగా టాలీవుడ్ హీరోల హవా నడుస్తోంది.

 Not Prabhas Ntr Allu Arjun But Ram Pothineni Is Number One In Hindi Here The Pro-TeluguStop.com

బాహుబలి ( Bahubali )సినిమాతో ప్రారంభమైన ఈ హవా ఇప్పుడు పుష్ప 2 వరకు కొనసాగుతోంది.బాలీవుడ్‌ సినిమాల జోరు తగ్గి తెలుగు సినిమాలకూడా ప్రయారిటీ బాగా పెరుగుతోంది.

టాలీవుడ్‌ మూవీస్‌ హిందీలో భారీ కలెక్షన్లని సాధిస్తూ దుమ్మురేపుతున్నాయి.ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేస్తున్నాయి.

అక్కడి స్టార్స్ కి పెద్ద ఝలక్ ఇస్తున్నాయి.థియేట్రికల్‌గానే డిజిటల్‌ పరంగా, ఓటీటీ పరంగానూ తెలుగు హీరోల హవా నడుస్తుంది.

Telugu Allu Arjun, Bollywood, Hindi, Prabhasntr, Prabhas, Ram Pothineni, Tollywo

అక్కడి మార్కెట్‌పై మన హీరోలు పోటిపడుతుండటం విశేషం.అయితే థియేట్రికల్‌గా ప్రభాస్‌, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌ చరణ్‌ ( Prabhas, NTR, Bunny, Ram Charan )వంటి స్టార్స్ పోటీ పడుతున్నా, డిజిటల్‌లో మాత్రం యంగ్‌ హీరోల హవా నడుస్తోంది.మరి ముఖ్యంగా ఇందులో రామ్ పోతినేని నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.హిందీలో మన తెలుగు సినిమాలను డబ్‌ చేసి యూట్యూబ్‌లలో, ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు.అక్కడ మన సినిమాకు విశేషంగా ఆదరణ లభిస్తోంది.ముఖ్యంగా రవితేజ, రామ్‌, ఎన్టీఆర్‌, బన్నీ లాంటి హీరోల సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

ముఖ్యంగా యాక్షన్‌ సినిమాలకు విశేష ఆదరణ దక్కుతోంది.ఇందులో రామ్‌ పోతినేని మొదటి స్థానంలో నిలిచారు.

ఆయన నటించిన నేను శైలజ మూవీ ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్‌ పొందిన తెలుగు డబ్బింగ్‌ మూవీగా నిలిచింది.

Telugu Allu Arjun, Bollywood, Hindi, Prabhasntr, Prabhas, Ram Pothineni, Tollywo

ఈ సినిమా ఏకంగా 630 మిలియన్స్ వ్యూస్‌ని సాధించడం విశేషం.రెండో స్థానంలో అల్లు అర్జున్‌ నటించిన సరైనోడు.ఉంది.ఇది 483 మిలియన్‌ వ్యూస్‌ తో సెకండ్‌ తెలుగు మూవీగా నిలిచింది.415 మిలియన్‌ వ్యూస్‌ తో విజయ్‌ దేవరకొండ నటించిన డియర్‌ కామ్రేడ్‌ మూడో స్థానంలో ఉంది.353 మిలియన్‌ వ్యూస్‌ తో అఖిల్‌ మిస్టర్‌ మజ్ను నాలుగవ స్థానంలో ఉంది.309 మిలియన్‌ వ్యూస్‌ తో రామ్‌ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ ఐదో స్థానంలో ఉంది.ఆ తర్వాత స్థానాలలో బృందావనం,రేసుగుర్రం,మగధీర,అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి సినిమాలు ఉన్నాయి.ఈ ప్రకారంగా చూసుకుంటే ఇందులో రాం పోతినేని అందరికంటే ముందు వరుసలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube