టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.
ఇటీవల దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్( 400 crore collections ) ని సాధించి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ అదే స్టార్ డమ్ ని కొనసాగించడం కోసం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
కానీ ఆ గ్లోబల్ స్టేటస్ ని మైంటైన్ చెయ్యాలంటే ఒక రేంజ్ స్టైలింగ్ ని చూపించాలి.

కానీ ఎన్టీఆర్ మాత్రం ఎయిర్ పోర్ట్ లో కానీ( airport ), మిగతా ఎక్కడైనా చాలా క్యాజువల్ గా హ్యాంగర్ కి ఉన్న చొక్కా వేసుకుని వెళ్లిపోతుంటాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంప్లైంట్.అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి బయట కనిపిస్తే బ్రాండ్ తో కనిపిస్తారు, షర్ట్ దగ్గర నుంచి, షూస్ వరకు, హెయిర్ స్టయిల్ దగ్గర నుంచి చేతికి ఉన్న వాచ్ వరకు, భుజానికి వేసుకునే బ్యాగ్ దగ్గర నుంచి క్యాప్ వరకు అన్ని అందరూ మాట్లాడుకునేలా బ్రాండెడ్ స్టయిల్స్ చూపిస్తారు.వారు బయట కనబడితే ఫ్యాన్స్, జనాలు వాళ్ళు ధరించే బ్రాండ్స్ గురించే మాట్లాడుకుంటారు.
కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.ఎప్పుడు కనిపించినా కూడా ఎన్టీఆర్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు.

దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ ల మాదిరిగా ఉండమంటూ ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఎన్టీఆర్ వార్ 2 కోసం ముంబై వెళ్లివస్తున్నాడు.హైదరాబాద్ వచ్చినప్పుడు, ముంబై వెళ్ళినపుడు మాత్రమే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎన్టీఆర్ స్టైలింగ్ గురించిన ముచ్చట వినిపించడమే లేదు, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డిజప్పాయింట్ కలిగిస్తుంది.అందుకే ఎన్టీఆర్ అన్నా స్టయిల్ మార్చు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరి ఈ విషయంపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు అభిమానుల కోరిక మేరకు తన స్టైల్ ని మార్చుకుంటారా లేదా అన్నది చూడాలి మరి.