ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో తమ ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటిని షూట్ చేయగలుగుతున్నారు.ఇంకేముంది సోషల్ మీడియా హవా బాగా ఉండడంతో అటువంటి ఘటనలకులు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా అటువంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చి, అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.విషయం ఏమిటంటే.
యూనియన్ బ్యాంక్‌లో జైమన్ రావల్ ఫిక్స్‌డ్(Jaiman Rawal fixed at Union Bank) డిపాజిట్ చేశాడు.ఆ మొత్తం డబ్బుపై బ్యాంక్ ట్యాక్స్ విధించింది.
దీంతో కస్టమర్ బ్యాంక్ మేనేజర్‌పై దాడికి దిగి, మాటలతో కాకుండా చేతులకు పని చెప్పాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad, Gujarat)జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.FDపై ట్యాక్స్ మినహాయించకపోవడం అతనికి నచ్చక ఏకంగా బ్యాంక్ మేనేజర్ పైనే చేయిచేసుకున్నాడు.మొదటి వారి మధ్య మాటలు సాగగా, అది కాస్త చినికి చినికి గాలివానై ఘర్షణకు దారితీసింది.
దీంతో బ్యాంక్ మేనేజర్ (bank manager)అతని చేతిలో తన్నులు తిన్నాడు.దాంతో బ్యాంక్ లో ఉన్న వారు మధ్య ఘర్షణ వీడియో తీశారు.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదట జైమన్ రావల్(Jaiman Rawal) అతని తల్లితో పాటు బ్యాంక్‌కు వచ్చి జరిగిన దాని గురించి మేనేజర్ ని అడగగా మేనేజర్ సమాధానం నచ్చక దాడికి దిగాడు.దాంతో అక్కడున్నవారందరూ అడ్డుకోవడానికి యత్నించారు.అయినా జైమన్ రావల్ ఆగకుండా బ్యాంక్ మేనేజర్‌ను కుక్కని కొట్టినట్టు కొడుతూనే ఉన్నాడు.
డిసెంబర్ 7న జైమన్ రావల్ వస్త్రాపూర్ ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ (Union Bank)బ్రాంచ్‌కు వెళ్లినట్టు అక్కడి రికార్డ్ అయింది.అతని ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పెరిగిన ట్యాక్స్ ఎగ్జమ్షన్‌పై ఆగ్రహం చెందాడు.
దీని గురించి బ్యాంక్ మేనేజర్, జైమన్ రావల్ మధ్య వాగ్వాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఒకరినొకరు కాలర్ పట్టుకుకున్నారు.
తరువాత ఇద్దరి మధ్య సినిమా రేంజ్‌లో ఫైటింగ్ జరిగింది.వారిని ఆపుతున్న బ్యాంక్ సిబ్బందిపై కూడా జైమన్ రావల్ దాడి చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







