బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఈ ఏడాది కల్కి(Kalki) సినిమాతో భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు ఆ సినిమా రేంజ్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో బన్నీ(Bunny) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అమితాబ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు.
అమితాబ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నారని పేర్కొన్నారు.

ఎంతోమంది నటీనటులకు అమితాబ్(Amitabh) స్పూర్తి అని ఆయన చెప్పుకొచ్చారు.అమితాబ్ సినిమాలు చూస్తూ తాను పెరిగానని బన్నీ కామెంట్లు చేశారు.ఈ వీడియో తన దృష్టికి రావడంతో బన్నీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా గురించి బన్నీ చేసిన కామెంట్లు విన్నానని బన్నీకి కృతజ్ఞతలు అని అమితాబ్ పేర్కొన్నారు.అల్లు అర్జున్(allu arjun) నా అర్హతను మించి ప్రశంసించారని నిజం చెప్పాలంటే నేను బన్నీ ప్రతిభకు పనితీరుకు అభిమానినని ఆయన కామెంట్లు చేశారు.
బన్నీ ఇలాగే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలని ఇలాంటి ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని అమితాబ్ వెల్లడించారు.అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు.

అయితే అమితాబ్ చేసిన పోస్ట్ కు బన్నీ సైతం రియాక్ట్ అయ్యారు.అమితాబ్ సూపర్ హీరో అని ఆయన నుంచి ఇలాంటి ప్రశంశలను నమ్మలేకపోతున్నాను అని బన్నీ పేర్కొన్నారు.నాపై అమితాబ్ కు ఉన్న ప్రేమకు ధన్యవాదాలు అని బన్నీ కామెంట్ చేశారు.మరోవైపు పుష్ప ది రూల్(Pushpa the Rule) ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను(Collections) సొంతం చేసుకుంది.
రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.