మీ ఫోన్ ఆఫ్ బ్యాటరీ అయిందని ఆందోళన చెందుతున్నారా .అయితే మీకు ఈ సమస్య కచ్చితంగా ఉంది.
దీనిని నోమోఫోబియా ( Nomophobia ) అని అంటారు.ఫోన్ ( Mobile Phone ) లేకుండా జీవించలేని జనరేషన్ ఎదురుకుంటున్న ముఖ్యమైన మానసిక సమస్య ఇది.కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అండ్ ఒప్పో శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియా లాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్నారు.వీళ్లందరికీ ఫోన్‌కి దూరంగా ఉండటం భయంగా ఉంటుంది.

దేశంలోని 72% మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.వారి ఫోన్ బ్యాటరీ 20 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఆందోళన చెందుతూ ఉంటారు.నోమోఫోబియా యాంగ్జయిటీ కన్స్యూమర్ స్టడీ అనే నివేదిక ఇటువంటి పరిస్థితి గురించి వెల్లడించింది.ఒప్పో సేవా లను మెరుగుపరచుకోవడంలో భాగంగా ఈ రీసెర్చ్ నిర్వహించింది.రీసర్చ్ కోసం స్పందించిన చాలా మంది వారి స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా, ఇంకా కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే 65% మంది ప్రజలు వారి ఫోన్ బ్యాటరీని అయిపోకుండా ఫోన్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే 21 శాతం మంది వారి ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియా వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు.ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ను వ్యక్తిగత జీవితంలో భాగమైపోయాయి.వ్యక్తులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఇంకా వినోదం కోసం ఒకరికి ఒకరు కరెక్ట్ అవుతున్నారు.దీనివల్ల వినియోగదారులు బ్యాటరీ డ్రైనైయింగ్( Battery Draining ) ఇంకా ఫోన్ పాడైపోయిందని ఆందోళన చెందుతున్నారు.31 నుంచి 40 సంవత్సరాల వయసు వారు బ్యాటరీ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ లెక్కన వెనుకబడి ఉన్నట్లు వైద్యా నిపుణులు చెబుతున్నారు.