మెగాస్టార్ చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్న బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు అందరూ ఎప్పుడూ ఒకటే అన్న విషయం తెలిసిందే.కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పోట్లాడుకోవడం కొన్నిసార్లు కొట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

 Im Giving It To My Brother Says Chiranjeevi According To Balayya, Balakrishna, T-TeluguStop.com

ఇక టాలీవుడ్ హీరోల మధ్య ఉన్న సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.మరి ముఖ్యంగా నిన్నటి తరం సీనియర్ హీరోలు అయినా చిరంజీవి ,బాలకృష్ణ( Chiranjeevi, Balakrishna ) లకు అంటే ఒకరికి పడదేమో అన్న అభిప్రాయం చాలామందికి ఉండే ఉంటుంది.

కానీ ఇది కేవలం అపోహ మాత్రమే.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో బాలకృష్ణ చిరంజీవిని కూడా ఒకరు.

అందుకు ఇటీవల జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.

Telugu Balakrishna, Chiranjeevi, Imbrother, Brother, Tollywood-Movie

కాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు ( Balayya’s golden festival celebrations )చిరు ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.ఈ వేడుకలో భాగంగా మల్టీస్టారర్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరలయ్యింది.

ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో మరో సందర్భం వచ్చింది.నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు.

ఒక పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది.అందులో భాగంగా ముందు అల వైకుంఠపురములో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల( Srilila ) గెలుచుకుంది.

Telugu Balakrishna, Chiranjeevi, Imbrother, Brother, Tollywood-Movie

తర్వాత ఇంద్ర దాయి దాయి దామ్మ వంతు వచ్చింది.అయితే ఇద్దరూ సరిగా రీ క్రియేట్ చేయలేకపోయారు.దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారుమ్రోగిపోయింది.తర్వాత కుర్చీ మడతపెట్టి, దెబ్బలు పడతాయ్ రోయ్ తదితర సాంగ్స్ తో రౌండ్ కంటిన్యూ అయ్యింది కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి ఫ్యాన్స్ కి నచ్చేసింది.

ఇలా బాలయ్య బాబు తన షోలో చిరంజీవి గురించి ప్రస్తావన తేవడంతో మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube