ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లిళ్లు కాకముందే లివింగ్ రిలేషన్షిప్ అంటూ వారి సంసార జీవితాలను కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో చాలామంది జంటలు విడిపోతున్నాయి కూడా.
అయితే ఇలాంటి సందర్భాల్లో చాలామంది డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా లేకపోలేదు.ఇందుకు సంబంధించిన అనేక వార్తలు మీడియా ద్వారా చూసే ఉంటాము.
ఇకపోతే తాజాగా ఓ వైద్యురాలు తన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

తాజాగా ఓ మహిళా డాక్టర్( Lady doctor ) తన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.అయితే తన బాయ్ ఫ్రెండ్ తనని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ మహిళ డాక్టర్ ఇలా చేసిందని సమాచారం.ఈ ఘటన బీహార్ రాష్ట్రం( Bihar )లో చోటుచేసుకుంది.రాష్ట్రంలోని శరన్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు యువ మహిళా వైద్యురాలతో గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు.
అయితే ఈ ప్రేమను కాస్త పెళ్లిగా మార్చుకోవాలని వైద్యురాలు తన బాయ్ ఫ్రెండ్ ను తరచుగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.అయితే ప్రతిసారి తన బాయ్ ఫ్రెండ్ ఈ విషయాన్ని నెట్టుకుంటా వచ్చేసాడు.

అయితే ఒత్తిడి మరింత పెరగడంతో చివరికి రిజిస్టర్ మ్యారేజ్( Register marriage ) చేసుకోవడానికి చివరి నిమిషంలో అంగీకరించి అయితే కరెక్ట్ గా పెళ్లి చేసే సమయానికి అతను ఆఫీస్ కు రాకపోవడంతో ఆగ్రహించిన సదరు వైద్యురాలు వెంటనే అతని ఇంటికి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ చేసింది.అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు డాక్టరమ్మ నేరుగా ఆసుపత్రికి అతనిని తీసుకువెళ్లి చికిత్స అందిస్తుంది.ఇక సంఘటన వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయంలో ఎవరిది తప్పు ఉందో దానిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.