టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి (Heroine Priyamani) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రియమణి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో(Back to back Movies) నటిస్తూ దూసుకుపోతోంది.ఒకవైపు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది.అలాగే తెలుగు షోలతో పాటు కనడ, తమిళ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ (Tollywood , Bollywood)లలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.వివాహం చేసుకున్నప్పటి నుంచి కొందరు ప్రజలు తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.నాకు పుట్టబోయే పిల్లల ( childrens)గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు ప్రియమణి.కాగా ప్రియమణి 2017లో ముస్తాఫా రాజ్ తో ప్రియమణి(Priyamani with Mustafa Raj) ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.2016లో వీరి నిశ్చితార్థం జరిగిన నాటినుంచి ఆన్‌లైన్ వేదికగా విమర్శలు ఎదురవ్వడం ప్రారంభం అయ్యాయని ప్రియమణి అన్నారు.

నాకు ఎంగేజ్‌మెంట్ జరగ్గానే నా మనుషులంతా ఆనందిస్తారని అనుకున్నాను.వారితో ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకోవాలనుకున్నా.కానీ, అప్పటి నుంచి నాపై అనవసరమైన ద్వేషం ప్రారంభమైంది. లవ్ జిహాద్ (Love Jihad)ఆరోపణలు వచ్చాయి.పిల్లలు పుట్టాక వారిని ఐసిస్ లో జాయిన్ చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అవి ఎంతగానో బాధ పెడుతున్నాయి.
నేను మీడియా పర్సన్ ను కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోను.కానీ నా భర్తపై అలాంటి కామెంట్స్ తో ఎందుకు దాడి చేస్తున్నారు.
అతడి గురించి వివరాలు కూడా మీకు తెలియవు.కానీ, కామెంట్స్ మాత్రం చేసేస్తారు.
ఇప్పటికీ కూడా నేను నా భర్తతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తే పదిలో తొమ్మిది కామెంట్స్ మా వివాహం మీదనే ఉంటాయి.వాటివల్ల బాధపడాల్సి వస్తోంది అని ప్రియమణి అన్నారు.
ఈ సందర్భంగా ప్రియమణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.