శిరీష్ భరద్వాజ్ మరణం పై తల్లి షాకింగ్ కామెంట్స్.. ఆయన మరణానికి అదే కారణమా?

శిరీష్ భరద్వాజ్ ( Shirish Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాజీ అల్లుడుగా ఈయన అందరికీ సుపరిచితమే.మెగా డాటర్ శ్రీజ (Sreeja) ఇంట్లో వారికి తెలియకుండా మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు.

 Shrish Bhardwaj Mother Interesting Comments About Her Son Death , Shirish Bhardw-TeluguStop.com

అప్పట్లో ఈ విషయం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనగా మారింది.ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించిన తర్వాత ఇద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇక ఇటీవల శిరీష్ భరద్వాజ్ అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

Telugu Chiranjeevi, Nivruthi, Sreeja, Tollywood-Movie

ఈయన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ మరణించారంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో శిరీష్ భరద్వాజ్ తల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె తన కొడుకు గురించి అలాగే తన మనవరాలు ,శ్రీజ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మా అబ్బాయి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడి మరణించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అదంతా అవాస్తవమని తెలిపారు.

Telugu Chiranjeevi, Nivruthi, Sreeja, Tollywood-Movie

నా కుమారుడు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని ఈమె తెలిపారు.నా కొడుకు చనిపోయినప్పుడు మెగా కుటుంబానికి తెలిపామని కానీ వాళ్ళు ఎవరు రాలేదని తెలిపారు.ఇక శ్రీజ గురించి మాట్లాడుతూ శ్రీజ చాలా మంచి అమ్మాయి తను తన భర్తతో ఎందుకు గొడవలు పడి విడిపోయిందో తనకు తెలియదని తెలిపారు.ఇక ఆమె విడిపోయిన సమయంలో మా కుటుంబానికి మెగా ఫ్యామిలీ 33 కోట్ల రూపాయలు ఇచ్చిందని వార్తలు వచ్చాయి అదంతా వాస్తవమని కొంతమంది మాకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పినా మేము వద్దని చెప్పామని తెలిపారు.

ఇక తన మనవరాలు నివృత్తిని చూస్తే నాకు నా కొడుకుని చూస్తున్నట్టే ఉంటుందని నాకు కూడా ఆమెతో కలిసి మాట్లాడాలని ఉంది అంటూ ఈ సందర్భంగా శిరీష్ భరద్వాజ్ తల్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube