టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటుకోవడంతోపాటు తన క్రేజ్ ని మరింత పెంచుకున్నారు ప్రభాస్.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం చేతినిండా బోలెడు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.
అంతేకాకుండా ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టులు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానంలో ప్రభాస్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే కల్కి తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీల లైనప్ విషయంలో మరింత ఆసక్తి నెలకొల్పింది.
ప్రస్తుతం డార్లింగ్ చేతిలో ఆల్మోస్ట్ అరడజన్ సినిమాలు ఉన్నాయి.అయితే అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ఈ మధ్యన విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్2( Salaar 2 ) రాబోతుంది.
మరో పక్క ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్( Rajasaab ) మూవీలో నటిస్తున్నారు ప్రభాస్.ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం పూర్తయింది.
కల్కి హడావిడి అయిపోయిన వెంటనే మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు మూవీ మేకర్స్.ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమా నటించనున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ వర్క్ కూడా ప్రారంభమైందని మూడు పాటలను కూడా రెడీ చేసినట్లు ఇటీవల ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వివరించాడు.ఇక వీటితో పాటే కల్కి కొనసాగింపు కల్కి 2 సినిమా షూట్ కూడా త్వరలోనే పూర్తి చేయనున్నాడట.
ఇప్పటికే కల్కి 2( Kalki 2 ) ఆల్రెడీ 60% పూర్తయిందని మిగిలిన షూటింగ్ వచ్చే ఏడాది లోపు ఫినిష్ చేసి రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత అశ్విని దత్త్ తెలిపారు.ఈ సినిమాలతో పాట చానిమల్ మూవీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగాతో స్పెరిటి సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాస్.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.వచ్చే ఏడాదిలో స్పిరిట్ మూవీ షూట్ ప్రారంభమవుతుందని గతంలో సందీప్ రెడ్డి వంగ వివరించాడు.వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిథ్థార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా రానుందని గతంలో అనౌన్స్ చేశారు.ఇలా ప్రస్తుతం చేతినిండా ఆరు భారీ ప్రాజెక్టుల తో అందరి హీరోలా లైన్ అప్ కంటే బిజీ లైన్ అప్ తో తన స్టామినాను ప్రూవ్ చేశాడు ప్రభాస్.