వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుందా.? ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.? ఖరీదైన షాంపూ, ఆయిల్ వాడిన ఎటువంటి ఫలితం లభించడం లేదా.? అయితే చింతే అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు డబుల్ కాదు ట్రిపుల్ అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 If You Use This Natural Toner Once A Week, Your Hair Will Triple! Hair Toner, T-TeluguStop.com
Telugu Care, Care Tips, Long, Natural, Thick, Triple-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, మూడు రెబ్బలు కరివేపాకు వేసుకుని వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.

Telugu Care, Care Tips, Long, Natural, Thick, Triple-Telugu Health

ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు హెయిర్ టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టోనర్ ను వాడితే జుట్టు రాలమన్న రాలదు.

హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడానికి ఈ టోనర్ అద్భుతంగా సహాయపడుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కొద్దిరోజుల్లోనే మీ ఉన్న జుట్టు మూడింతలు అవుతుంది.

అలాగే ఈ హెయిర్ టోనర్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.దాంతో మీ జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.

ఈ వర్షాకాలంలో చాలామంది చుండ్రు సమస్యతో బాగా ఇబ్బంది పడుతుంటారు.అయితే అలాంటి వారికి కూడా ఈ టోనర్ అద్భుతంగా సహాయపడుతుంది.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ టోనర్ ను వాడితే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube