కొత్తగా కారు కొన్నవారు అక్టోబర్ 1 నుంచి వచ్చే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

కారు ఎవరికవసరం లేదు! ఈ రోజుల్లో ఫ్యామిలీతో అలా సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అందరూ కారులోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు.ఎందుకంటే సౌకర్యం వంతం పైగా ఈ రణగొణధ్వనులకు దూరంగా ఉండొచ్చు.

 New Car Buyers Know These New Rules From October 1!new Car, Buyers, Good News,-TeluguStop.com

అందుకే సామాన్యులు కూడా ఇప్పుడు తమ ఉన్నంతలో కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకున్న పరిస్థితి.ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు సేఫ్టీ ఫీచర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

ఈ నేపథ్యంలో కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం( Central Govt ) కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతోందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.అక్టోబర్ 1 నుంచి, ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

Telugu Buyers, Latest, Car, October-Latest News - Telugu

దేశంలో కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు భారత ప్రభుత్వం భారత్ ఎన్‌క్యాప్ (Bharat- NCAP – భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ను ఒకదానిని ప్రవేశ పెట్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇది దేశంలోని కార్లకు సేఫ్టీ రేటింగ్( Safety rating ) ఇవ్వనుంది.ఈ సిస్టమ్‌ ద్వారా ప్రస్తుత కార్ల కంటే భవిష్యత్తులో రానున్న కార్లు మరిన్ని భద్రతా ప్రమాణాలతో వచ్చే అవకాశం కలదు.భారత్‌ NCAP అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

భారత్ NCAP అమల్లోకి వస్తే కొత్త కారు కొనుగోలుదారులు తమ భద్రత గురించి మరింత అవగాహన కలిగి ఉండే అవకాశం జనాలకు ఉంటుంది.భద్రతకు సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ NCAP నిబంధనలు రూపొందించబడ్డాయి.https://telugustop.com/wp-content/uploads/2023/07/New-car-buyers-good-news-October-new-rules-latest-news-Safety-rating.jpg

Telugu Buyers, Latest, Car, October-Latest News - Telugu

ఈ నేపథ్యంలో పెద్దలు, పిల్లల రక్షణ, పాదచారులకు అనుకూలమైన డిజైన్, కారు సేఫ్టీ ఫీచర్స్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.గ్లోబల్ NCAP మాదిరిగానే వాహనాల్లో భద్రతా ప్రమాణాలను పరీక్షించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్‌ను ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది.క్రాష్‌ టెస్ట్‌, సేఫ్టీ రేటింగ్‌లు AIS-197 కి లోబడి ఉంటాయి.ఆటోమేకర్లు తమ కార్ల కోసం స్వచ్ఛందంగా భారత్ NCAP పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.దేశీయ, విదేశీ తయారీ పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవర్ సీటుతో సహా 8 సీట్లు, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న కార్లు భారత్ NCAP పరీక్ష చేయించుకోవాలి.టాటా మోటార్స్, మారుతీ సుజుకి, టయోటా( Toyota ), స్కోడా, కియా, మహీంద్రాతో సహా కంపెనీలు భారత్ NCAPని స్వాగతించడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube