ఒక సినిమా ఎంతో ప్రభావితం చేసే మాధ్యమం అనే విషయం అందరికి తెలుసు.అందుకే ఒక సినిమా వస్తుంది అంటే దానికి విపరీతమైన అంచనాలు ఉంటాయి.
అలాగే అంచనాలు ఎక్కువ అయ్యి ఒక్కోసారి బోల్తా కొడతాయి కూడా.అలా సినిమా పరాజయం పాలయింది అన్నా కూడా దాని ప్రభావం అదే రేంజ్ లో అభిమానులతో పాటు నిర్మాత, దర్శకుడు మరియు హీరో పై ఉంటుంది.
ఇక కొంతమంది హీరోలు తమ ఇష్టమైన డైరెక్టర్ లేదా కథ బాగా చెప్పిన డైరెక్టర్స్ కి ఒకటికి మించిన సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు.అలా ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయిపోయి మొదటి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వెళ్లిన తర్వాత దాని ఫలితాన్ని బట్టి ఆ తర్వాత చేయబోయే సినిమా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది.అంటే మొదట ఒప్పుకున్న సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఆ తర్వాత కమిట్ అయిన సినిమాను క్యాన్సల్ చేసుకుంటారు అలా క్యాన్సల్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభాస్
ప్రభాస్( Prabhas ) మరియు సుజిత్ చాలా మంచి మిత్రులు అందుకే బాహుబలి సినిమా తర్వాత ఆ మొదట సుజిత్ తో సాహో సినిమా(Saaho ) చేయడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడు దీనికి రెండవ పార్ట్ కూడా ముందే కమిట్ అయ్యాడు ప్రభాస్.కానీ మొదటి భాగాన్నే ప్రేక్షకులు రిజక్ట్ చేయడంతో రెండవ సినిమా చేయడానికి నో చెప్పేసాడు.
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు అయితే ఏ గతంలో పూరి జగన్నాథ్ తో లైగర్ అనే సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా పరాజయం తో పూరితో చేయాల్సిన జనగణమన సినిమాని సైతం విజయ్ దేవర కొండ ఆపేశాడు.
సాయి ధరమ్ తేజ్
సాయి ధరంతేజ్ తేజ్ ఐ లవ్ యు అనే ఒక సినిమా తీశాడు ఇది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ప్రేక్షకులకు గుర్తు కూడా లేదు అయితే ఈ సినిమాతో పాటే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నీ సైతం ఓకే బ్యానర్ పై సాయి ధరంతేజ్ చేయడానికి ఒప్పుకున్నాడు కానీ తేజ్ ఐ లవ్ యు ( Tej I Love You )పరాజయంతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నుంచి తప్పుకున్నాడు.