టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి శ్యామల ( Shyamala ) ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు.ఈమె ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేయడమే కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు.తప్పకుండా ఈ ఎన్నికలలో తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కానీ 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
![Telugu Pawan Kalyan, Shyamala, Tollywood, Ycp, Ys Jagan-Movie Telugu Pawan Kalyan, Shyamala, Tollywood, Ycp, Ys Jagan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Tollywood-chances-Shyamala-Pawan-Kalyan-Ycp-party-Tollywood.jpg)
ఈ విధంగా కూటమి అధికారంలోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా యాంకర్ శ్యామలపై భారీ స్థాయిలో ట్రోల్స్ మొదలయ్యాయి.అయితే ఈ ట్రోల్స్ గురించి వీడియో విడుదల చేశారు.అయితే ఎన్నికల తర్వాత ఈమె ఇప్పటివరకు బయటకు వచ్చిన సందర్భాలు కూడా లేవు.
మొదటిసారి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వైసీపీ (YCP) ఓటమికి గల కారణాలను తెలిపారు.తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించింది కానీ ప్రజలకు సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా కావాలని అభివృద్ధి వైపు ఓట్లు వేశారని తెలిపారు.
![Telugu Pawan Kalyan, Shyamala, Tollywood, Ycp, Ys Jagan-Movie Telugu Pawan Kalyan, Shyamala, Tollywood, Ycp, Ys Jagan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Tollywood-chances-Shyamala-Pawan-Kalyan-Ycp-party-Tollywood-ys-jagan-social-media.jpg)
ఇలా వైసీపీ ఓటమికి అదే ప్రధాన కారణమని యాంకర్ శ్యామల ఈ సందర్భంగా తమ పార్టీ ఓటమికి గల కారణాలను తెలియజేశారు.ఇకపోతే ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు లేవంటూ వస్తున్న వార్తల గురించి కూడా స్పందించారు.ఇప్పటికే కొన్ని బుల్లితెర చానల్స్ తనని పూర్తిగా దూరం పెట్టడం వాస్తవమేనని తెలిపారు.అయితే నేను ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తానని అయితే ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయించే ఒక ఫ్యామిలీ నాకు ఇకపై ఇలాంటి అవకాశాలు కల్పిస్తారా లేదా అన్నది చూడాలి ఇప్పటివరకు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ జరగలేదు.
ముందు ముందు నాకు అవకాశాలు ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.