దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!

మన మొత్తం ఆరోగ్యంలో దంతాలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి.ఎలాంటి ఆహారం తినాలన్నా దంతాలు దృఢంగా ఉండడం ఎంతో అవసరం.

 Follow These Tips For Stronger And Whiter Teeth! Strong Teeth, White Teeth, Heal-TeluguStop.com

అందుకే దంతాల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.అయితే దృఢమైన, తెల్లటి దంతాలను పొందడానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.

ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( coconut oil ) రెండు మూడు చుక్కలు పెప్పర్ మెంట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి రోజు పళ్ళు తోముకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల దంతాలపై పసుపు మరకలు పోతాయి.

దంతక్షయానికి దూరంగా ఉండవచ్చు.మరియు దంతాలు తెల్లగా సైతం మెరుస్తాయి.

Telugu Tips, Healthy Teeth, Latest, Oral, Teeth, White Teeth-Telugu Health

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో అర టీ స్పూన్ తులసి ఆకుల పొడి, చిటికెడు లవంగాల పొడి( Clove powder ) మరియు వాటర్ వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని యూజ్ చేసి బ్రష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా దంతాలు తెల్లగా మారతాయి.దృఢంగా తయారవుతాయి.మరియు తులసి, లవంగాల్లో ఉండే పోషకాలు, ఔష‌ధ గుణాలు చిగుళ్లను గట్టిగా మారుస్తాయి.ప్రమాదకరమైన బ్యాక్టీరియా, టాక్సిన్లను బయటకు పంపి నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

Telugu Tips, Healthy Teeth, Latest, Oral, Teeth, White Teeth-Telugu Health

ఇకపోతే దంతాల ఎనామెల్‌ను బలపరిచేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడేది ప్రోటీన్.కాబట్టి ప్రోటీన్ కోసం పాలు, పెరుగు, జున్ను మరియు ఇతర పాల ఉత్పత్తుల‌ను ఆహారంలో భాగం చేసుకోండి.అలాగే దృఢమైన ఆరోగ్యమైన తెల్లటి దంతాల కోసం సెలెరీ, క్యారెట్లు, ఇతర క్రంచీ కూరగాయలు, పాలకూర, బచ్చలి కూర, తాజా పండ్లు తీసుకోండి.వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అవి చిగుళ్ళు మరియు ఇతర కణజాలాలను సెల్ డ్యామేజ్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.దంతాల ఆరోగ్యానికి అండంగా నిలుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube